Vijayawada sakambari festival: ఇంద్రకీలాద్రి పై జూలై 3వ తేదీ నుంచి 5వరకు శాకంబరి ఉత్సవాలు...

Vijayawada sakambari festival: ఇంద్రకీలాద్రి పై జూలై 3వ తేదీ నుంచి 5వరకు శాకంబరి ఉత్సవాలు...
x
Vijayawada ammavari temple (file image)
Highlights

Vijayawada sakambari festival: ప్రతి ఏడాది ఆషాడమాసం ప్రారంభం అయిందంటే చాలు భక్తులు అమ్మార్లకు బోనాలు సమర్పించి, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. .

sakambari festival: ప్రతి ఏడాది ఆషాడమాసం ప్రారంభం అయిందంటే చాలు భక్తులు అమ్మార్లకు బోనాలు సమర్పించి, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా క్రిష్ణానది ఒడ్డున వెలసిన విజయవాడ, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అంటే జూలై-3 నుండి జూలై-5 వరకు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరిపించడానికి ఆలయ కమిటి నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయల కమిటీ అధికారులు ఉత్సవాల్లో పాల్గొనాలనుకునే భక్తుల కోసం కొన్ని నిబంధనలను జారీ చేస్తూ ప్రకటనను విడుదల చేసారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తులు దేవస్థాన వెబ్ సైట్ లో టైం స్లాట్ ప్రకారము టిక్కెట్టు తీసుకొని మహామండపము మార్గము ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, చేతులు శానిటైజేషన్ చేసుకుంటూ రావాలని తెలిపారు.

సిబ్బంది, భక్తులు సామాజిక దూరం పాటించాలని, ఈ ఉత్సవాల్లో ఎక్కువమంది సిబ్బంధిని కాకుండా తక్కువ మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్జ్ట్యా మొదటి 2 రోజులు ఆలయంలో సాధారణ అలంకారం చేయడానికి, మూడో రోజు అమ్మవారి ముఖమండపము నుండి ద్వజస్తంభం వరకు కూరగాయలు అలంకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

శాకంబరి ఉత్సవాలను జూన్ 3వ తేది ఉదయం 8-00 గం.లకు గణపతి పూజతో ప్రారంభించి, వైదిక కార్యక్రమములు, చండీహోమం, మూలమంత్ర హవనాలు జరిపించి జూన్ 5 న 11-00 గం.లకు పూర్ణాహుతి తో కార్యక్రమాన్ని ముగిస్తామని తెలిపారు.

శ్రీ అమ్మవారి అలంకారానికి కావలసిన కూరగాయలు దాతల నుండి సేకరించుటకు కమిటీని ఏర్పాటు చేయనున్నామన్నారు. భక్తులు భక్తిశ్రద్దలతో ఇచ్చే కాయగూరలు తీసుకోవడానికి గాను మహామండపము పక్కన పెద్ద షెడ్డులో ప్రత్యేకంగా ఓ కౌంటరు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కదంబ ప్రసాదం ఏర్పాటు చేయనున్నామన్నారు.

ఆషాడ మాసం సందర్బముగా తెలంగాణా రాష్ట్రం బోనముల కమిటీ వారు జూలై 5 న ఉదయం శ్రీ అమ్మవారికి బోనములు సమర్పించుటకు రాన్నున్నారన్నారు.

జూన్ 22 సోమవారం నుండి ఆషాడ అమావాస్య 20 సోమవారం వరకు అంటే నెలరోజులు పాటు అమ్మవారికి సారెను సమర్పించవచ్చని అది భక్తులకు ఎంతో శ్రేయోదాయకమని తెలియజేయజేసారు.

శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించాల్సిన భక్తులు ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు ఆన్ లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు తీసుకొని గుంపులు గుంపులుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా రావలని తెలిపారు.

శ్రీ అమ్మవారికి సమర్పించే చీరలు దర్శనం అనంతరం దేవస్థానం కౌంటరు నందు సమర్పించి రశీదు పొందాలరని, రశీదు పొందిన చీరలు మాత్రమే శ్రీ అమ్మవారికి అలంకరిస్తామని తెలిపారు.

దేవస్థానంలో పనిచేసే 920 మంది సిబ్బంధికి కోవిడ్-19 టెస్టులు చేయించామని వారిలో అర్చకులు, సెక్యులర్ సిబ్బంది, సెక్యూరిటీ, ఎస్.పి.ఎఫ్., హోమ్ గార్డులు, స్వీపర్లు ఉన్నారన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆలయంలో 55 సంవత్సరాలు పైబడిన వారిని విధులకు దూరంగా ఉంచామని తెలిపారు.

భక్తులు కోరిక మేరకు శ్రీ అమ్మవారి ఆలయంలో జూలై 1నుంచి నుంచి ఖడ్గమాలార్చనను పూజల ముఖమండపంలో ఉదయం 4-30 ని.లకు నిర్వహించనున్నామన్నారు.

అదే విధంగా శ్రీ చక్రనవావర్ణార్చన ఉదయం 7-30 ని.లకు జరిపించుటకు నిర్ణయించామని తెలిపారు.

భక్తుల తలనీలాలు ఇచ్చి మొక్కలు తీర్చుకోవడానికి జూలై 1 నుండి కేశఖండన పంపార్ట్ మెంట్లను కూడా ప్రారంభిస్తామన్నారు. 10 సంవత్సరముల లోపు పిల్లలకు, 60 సంవత్సరములు పైబడిన వారికి అనుమతించబడదు. టైం స్లాట్ ప్రకారము గంటకు 90 టిక్కెట్లు ఇవ్వడానికి, రోజుకి 30 మంది నాయిబ్రాహ్మణులతో మాత్రమే విధులు నిర్వహించుటకు నిర్ణయించామన్నారు.

భక్తులు అన్ని ఆర్జిత సేవ టిక్కెట్లు, దర్శనము టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు, ప్రసాదము టిక్కెట్లను దేవస్థాన వెబ్ సైటు ఆన్ లైను ద్వారా (www.kanakadurgamma.org) ద్వారా తీసుకొని రావాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories