వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు ?

వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు ?
x
Highlights

శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించినది. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుండి ఆవిర్భవించాడు. చంద్రుడు శ్రీ...

శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించినది. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుండి ఆవిర్భవించాడు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది . శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉండటానికి మరో ముఖ్య కారణం. శ్రావణ మాసం శ్రవణా నక్షత్రయుక్త మాసము. ఇది తన భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం. సాధారణంగా పౌర్ణమి శ్రవణా నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఇంచుమించుగా కలిసే వస్తాయి. అందువలన శ్రీ మహాలక్ష్మీ దేవి మరింత ప్రసన్నంగా ఉంటుంది. అలా శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉన్న పున్నమి ముందు శ్రావణ శుక్రవారం రోజున, ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే, వారి సమస్త కోరికలు నేరవేరడమే కాకుండా, వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును చేసుకోవాలని చెప్పారు. ఆ రోజున ముత్తయిదువులకు వీలుకాని పక్షంలో మాత్రమే మూడవ శ్రావణ శుక్రవారం కూడా నోచుకోనవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories