ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ

ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ
x
Highlights

* తిరుమలలో ఈసారి మరింత మందికి వైకుంఠ ద్వార ప్రవేశం * అధ్యయనోత్సవాలలతో పాటు శ్రీవారి దర్శనం * ఆన్‌లైన్ టిక్కెట్టన్నీ బుకింగ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లు స్థానికులకే * 24 నుంచి 26 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవల రద్దు * తొలిసారిగా ఈ ఏడాది పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు

ఈ నెల 25 వైకుంఠ ఏకదాశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో.. కలియుగ దైవం తిరుమలేశుడి దర్శనాలకు టీటీడీ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. ఈ సారి ఏకంగా పది రోజుల పాటు వైకుంఠ దర్శనాలు కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబరు 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ దర్శనాల్లో భక్తులను అనుమతించనుంది.

ఏటా ముక్కోటి ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే తెరిచే వైకుంఠ ద్వారానికి ఎంతో ప్రాధన్యత ఉంది. ఆ రెండు రోజుల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఈ ద్వారం గుండా ఏడు కొండల వాడిని దర్శించుకుంటే పుణ్య ఫలాల లభిస్తాయని భక్తుల నమ్మకంగా భావిస్తారు..

వైకుంఠ దర్శనం కోసం ఆన్‌లైన్ లో పెట్టిన టికెట్లలన్నీ ఇప్పటికే బుక్ అయ్యాయి. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు ప్రత్యేక ప్రవే దర్శనం టిక్కెట్లను రోజుకు 20వేల చొప్పున 2లక్షల టికెట్లను ఇప్పటికే టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు కింద మరో 18వే టిక్కెట్లను జారీ చేసింది. ఆన్‌లైన్ లో పెట్టిన గంటల వ్యవధిలోనే ఈ టికెట్లు అయిపోయాయి. సామాన్య భక్తుల కోసం రోజుకు 8వేల టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇవ్వనుంది. ఆఫ్‌లైన్‌ టిక్కెట్లను దర్శనానికి ఒకరోజు ముందు ఇవ్వనున్నారు. అయితే.. ఇవి కేవలం స్థానికులకు మాత్రమే పరిమితం చేశారు. ఇతర ప్రాంతాల వారికి అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్నిపూర్తి చేశారు. పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాకారం, ఇతర ప్రదేశాలను నిన్న ఉదయం 6 గంటల నుంచి 11గంటల వరకు శుద్ధి చేశారు. అనంతరం తిరిగి ఉత్సవ విగ్రహాలను యధాస్థానంలో ఉంచి మూలమూర్తికి చుట్టు ఉన్న వస్త్రాన్ని తొలగించి అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తి చేసి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories