వేంకటేశుడికి వెంట్రుకలు ఉంటాయా? అసలు నిజాలేంటి?

వేంకటేశుడికి వెంట్రుకలు ఉంటాయా? అసలు నిజాలేంటి?
x
Highlights

వేంకటేశ్వరుని వైభవం గురించి...వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత విన్నా తక్కువే. మహాద్వార గోపురం ద్వారా లోపలకి ప్రవేశిస్తే కలిగే ఆనందానుభూతి...

వేంకటేశ్వరుని వైభవం గురించి...వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత విన్నా తక్కువే. మహాద్వార గోపురం ద్వారా లోపలకి ప్రవేశిస్తే కలిగే ఆనందానుభూతి అనంతం. కానీ సాలాగ్రమ శిలా స్వరూపంగా, కాలానికి అతీతుడిగా, ఉత్తమోత్తమ పరిణామాలతో, మహా పురుష లక్షణాలతో కొలువైన శ్రీవారి ధృవబేరంపై ఉన్న కురులు నిజమైనవా? శాశ్వతుడైన నారాయణుడికి ఇలాంటి అశాశ్వతమైన మానవ లక్షణాలు ఉంటాయా? స్వయం వ్యక్తమైన అర్చావతార స్వరూపంపై ఉన్న అభిప్రాయాలేమిటి? ప్రచారాలేమిటి? ఎందుకంటే శ్రీవారి ధృవబేరం శిల్పశాస్త్రంలోని మహా పురుష లక్షణాలు, ఉత్తమోత్తమ పరిణామాలతో శ్రీవారి మూల బింభం విగ్రహంలోనే ఉంది. కిరీటం, మకరకుండలాలు, ప్రలంబ యజ్ఞోపవీతం కంఠాభరణాలు, కంకణాలు, అంగుళీయకాలు నడుంపై ఉండే సింహలలాటమనే అలంకారం, ఉదర బంధం, పీతాంబరం, ఉత్తరీయం, శంఖచక్రాలు, అందెలు, పాగడాలు, మొదలైనవి శ్రీవారికి అలంకారమై ఉన్నాయి.

శ్రీవారు దివ్యమంగళరూపం అపురూప సౌందర్యం. వెనుక వైపు కూడా స్వామివారు చాలా సుందరంగానే ఉన్నారంటారు... స్వామిని నిత్యం తాకి అభిషేకించే ప్రధానార్చకులు రమణదీక్షితులు. వెనుక చేతుల భుజాలు వెడల్పుగానూ, సన్నటి నడుము, కుండలినీ స్వరూపంలోె ఉన్న కౌపీనం, భుజాల వరకు వంకీలుగా ఉన్న జుట్టు శిలాస్వరూపంగానే ఉంటుందని చెబుతారాయన. శిరచ్ఛక్రం కూడా ఉంటుందనీ, కంఠాభరణాలకు, బాజీబంధాలకు ఉండే పట్టుదారాల కుచ్చులు కూడా చాలా సౌందర్యవంతంగా ఉంటాయని వివరించారు.

సాలగ్రామ స్వరూప విగ్రహంగా ఉన్న శ్రీవారి మూలవిరాట్టుకు నిజమైన కేశాలు ఉన్నాయన్నది ఒక అపనమ్మకం, అబద్దమని తేల్చిచెప్పారు రమణ దీక్షితులు. ఎందుకంటే స్వామివారు కాలానికి అతీతుడని చెబుతారాయన. వెంట్రుకలనేవి అశాశ్వతమైన మానవ లక్షణమనీ, శాశ్వతమైన స్వామివారికి ఇలాంటి అశాశ్వతమైన ఉంటాయనడం అపనమ్మకమేనని కొట్టి పారేస్తున్నారు. స్వామి వారి మూల విరాట్టు విగ్రహం ముట్టుకుంటే మెత్తగా ఉంటుందన్న ప్రచారంతో పాటు... చెమట పడుతుందన్న ఇంకో ప్రచారంలో కూడా నిజాలు లేవంటారు. చెమట పట్టడమూ మానవ లక్షణంగానే చెబుతారు.

దేవతలకే సార్వభౌముడైన స్వామివారికి చెమట పట్టడమనేది నిజం కానే కాదన్న విషయం తేలిపోయింది. నిజమైన కేశాలు లేవనీ, శ్రీవారి మూల విరాట్టు విగ్రహం స్వయం వ్యక్తమైన అర్చావతార స్వరూపంగా రమణదీక్షితులు చెబుతున్నారు. స్వామి వారి కేశాలు కూడా శిలాస్వరూపమేననీ, ఉంగరాల జుట్టు, చివరన బాగా ఒత్తుగా, ఉంగరాలు తిరిగి వంకీలుగా భుజం కింద వరకు అంటే కిరీటం కింది వరకు మనకు కనిపిస్తుందనీ, చాలా అందంగా మలచబడిన స్వామి వారి కేశసంపదగా దాన్ని చెప్పారు రమణదీక్షితులు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories