Lighting Rules: దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

These Rules should be Strictly followed while Lighting a Lamp Near God
x

Lighting Rules: దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

Highlights

Lighting Rules: హిందూ మతంలో దీపం వెలిగించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తికాదు.

Lighting Rules: హిందూ మతంలో దీపం వెలిగించడం చాలా పవిత్రంగా భావిస్తారు. దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తికాదు. కొంతమంది నెయ్యి దీపాలు వెలిగిస్తే మరికొందరు నూనె దీపాలు వెలిగిస్తారు. కొందరు మట్టితో చేసిన దీపాలను మరికొందరు పిండితో చేసిన దీపాలను వెలిగిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో దేవుడి ముందు దీపం వెలిగించడానికి అనేక నియమాలు ఉన్నాయి. దీపం వెలిగించేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే పాజిటివ్‌ శక్తికి బదులు నెగటివ్‌ శక్తి విడుదలవుతుంది. ఈ నిబంధనల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇంట్లో దీపం కచ్చితంగా పడమర దిక్కున వెలిగించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ, శాంతి వాతావరణం ఏర్పడుతుంది. పూజలో నెయ్యి దీపం వెలిగిస్తే అది ఎల్లప్పుడూ దేవుడి కుడి వైపున ఉండాలని గుర్తుంచుకోండి. నెయ్యి దీపాన్ని కుడి చేతితో మాత్రమే పట్టుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు కలుగుతాయి.

ఒకవేళ పూజలో నూనె దీపం వెలిగిస్తే ఈ దీపాన్ని ఎల్లప్పుడూ దేవుడి ఎడమ వైపున ఉంచాలి. ఈ దీపాన్ని ఎడమ చేతిలో పట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. దీపం వెలిగించేటప్పుడు దీపం చిప్ప ఎక్కడా పగలకూడదని గుర్తుంచుకోండి. పగిలిన చిప్పలలో దీపాలను వెలగించడం వల్ల ఇంట్లోకి నెగటివ్‌ ఎనర్జీ వస్తుంది. నెయ్యి దీపంలో పూల వత్తిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మీరు నూనె దీపం వెలిగిస్తే మీరు పొడవైన వత్తిని ఉపయోగించాలని తెలుసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories