మేధోశక్తికి... శరీరపుష్టికి శ్రేష్ట్రం... నువ్వుల నూనె

మేధోశక్తికి... శరీరపుష్టికి శ్రేష్ట్రం... నువ్వుల నూనె
x
Highlights

అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని నిపుణులు అంటున్నారు. నువ్వుల గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది....

అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని నిపుణులు అంటున్నారు. నువ్వుల గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో తరచుగా వచ్చే ఐరన్ లోప సమస్యలకు నువ్వులు దివ్యౌషదంగా పనిచేస్తుంది. నువ్వులు పురుషులలో వీర్యవృద్ధిని, కలుగజేస్తుంది.

కీళ్ళనొప్పులకు వాతం, ఎముకల బలహీనత ఉన్నవారికి, శిరోజాలు పెరగడానికి, నోటిపూత, గొంతు నొప్పి వ్యాధులకు నువ్వులు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. బహిష్టు సమయంలో స్పూన్ నువ్వులపొడి, 1 స్పూన్ శొంఠిపొడి, చిటికెడు ఇంగువ కలిపి మాత్రగా చేసి ఒకపూట తింటే నొప్పి తగ్గుతుంది. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

పైల్స్ వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. బాలింతల్లో చనుబాలు పెరగడానికి నువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. రక్త విరేచనాలకు చర్మ సంబంధమైన వ్యాధులకూ, శరీరంపై గాయాలకూ నువ్వులను పూతగా పెడితే మంచి ఫలితం వస్తుంది. దంతాలకు కూడా నువ్వులు బాగా మేలు చేస్తాయి ఎందువల్ల అంటే నువ్వులలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

నువ్వు గింజలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. నల్ల నువ్వులలో మాత్రం ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. నువ్వుల నూనె శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అన్నం బాగా జీర్ణం కావడానికి కూడా నువ్వులు ఉపయోగపడతాయి. కేశ వృద్ధికి నువ్వుల నూనె పని చేస్తుంది.

నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను అరికడుతుంది. చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతుంది. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories