Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం..
ఈరోజు శుక్రవారం, 24 జూలై, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చవితి (సా. 4-39 వరకు) తర్వాత పంచమి, పుబ్బ నక్షత్రం (సా. 6-50 వరకు) తర్వాత ఉత్తర నక్షత్రం.. అమృత ఘడియలు ( మ. 12-46 నుంచి 2-17 వరకు), వర్జ్యం ( రా. 1-35 నుంచి 3-06 వరకు తె.వ. 3-40 నుంచి 5-11 వరకు) దుర్ముహూర్తం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) రాహుకాలం (ఉ. 10-30 నుంచి 12-00 వరకు) సూర్యోదయం ఉ.5-39 సూర్యాస్తమయం సా.6-32
ఈరోజు రాశి ఫలాలు
మేషం
సంపూర్ణ ఆత్మవిశ్వసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి . ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం .
వృషభం
శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు ఆమడ దూరంలో ఉంటె మంచిది. మహాలక్ష్మి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
మిథునం
శ్రమకు తగిన గుర్తింపు ఉంది. కొన్ని వ్యవహారములలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు . సకాలంలో సహాయం చేసేవారున్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన చేయడం మంచిది.
కర్కాటకం
అభివ్రుద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
సింహం
అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. కొన్ని సంఘటనలు మీలోని ఉత్సాహాన్ని పెంచుతాయి. సద్గురువుల సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.
కన్య
చేపట్టిన పనులో ఆటంకములు మీ సహనాన్ని పరిక్షిస్తాయి. మీ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి . కుటుంబ సభ్యుల సలహాలతో సమస్యలు తగ్గి మేలైన ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివాళ్ళు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది.
తుల
వ్రుత్తి ఉద్యోగ వ్యాపారాది రంగములలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి . బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృధా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వ్రుథా ప్రయాణములు చేయాల్సి ఉంటుంది. దుర్గా సందర్శనం శుభప్రదం.
వృశ్చికం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారమును కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. గణపతి స్తోత్రము చదవండి మంచి జరుగుతుంది.
ధనుస్సు
మిమి రంగాల్లో హుందాతనం తగ్గకుండా చూసుకోవాలి. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
మకరం
ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. మీ శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మీ పరిధిని దృష్టిలోపెట్టుకుని ఆలోచించండి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. తోటివారికి సహాయం చేయాలనే ఆలోచన మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.
కుంభం
విశేషమైన శుభ ఫలితాలున్నాయి. మానసికంగా ద్రుడంగా ఉంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును పెంచుతుంది. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది . ఇష్టదైవం దర్శనం శుభాన్నిస్తుంది.
మీనం
ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. ఒక సంఘటన మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు. ప్రయాణములలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాద కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రము పఠించడం మంచిది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire