అనంత కాలగమనాలు... మన్వంతరాలు... మహాయుగాలు

అనంత కాలగమనాలు... మన్వంతరాలు... మహాయుగాలు
x
Highlights

అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి...

అనంతమైన ఈకాలమానంలో ఎన్నో మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50 సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27 మహాయుగాలు గతించాయి. 28వ మహాయుగంలో 4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది. సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది. మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున 459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

కృతయుగం——-17,28,000

త్రేతాయుగం—– 12,96,000

ద్వాపరయుగం— 8,64,000

కలియుగం——- 4,32,000

_____________________

43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.

_____________________

మన లెక్కల ప్రకారం 360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం. అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట. 2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం. 360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో 31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు. ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు. 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14 మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం. 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ సంవత్సరం. ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో 5108 సంవత్సరాలు.

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించారు. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories