కుజదోషం అంటే ఏంటి... శాస్త్రం చెప్పిన లెక్కేంటి?

కుజదోషం అంటే ఏంటి... శాస్త్రం చెప్పిన లెక్కేంటి?
x
Highlights

నవగ్రహాల్లో సూర్యునికి తర్వాత పరాక్రమం గల గ్రహాధిపతి కుజుడు. ఆధిక్యం, పరాక్రమం, వీరధీర కార్యాలు, పరిపాలనా బలం, నమ్మకం, ఇతరులకు లొంగకపోవడం, ధర్మం,...

నవగ్రహాల్లో సూర్యునికి తర్వాత పరాక్రమం గల గ్రహాధిపతి కుజుడు. ఆధిక్యం, పరాక్రమం, వీరధీర కార్యాలు, పరిపాలనా బలం, నమ్మకం, ఇతరులకు లొంగకపోవడం, ధర్మం, నీతి, న్యాయం, పురుషాధికం వంటివి కుజగ్రహ లక్షణాలు. ఈ గ్రహ అనుగ్రహంతో పోలీస్, సైనిక, అగ్నిమాపక సిబ్బంది, ఉన్నతపదవుల్ని అలంకరిస్తారు. కుజదోషంతో వివాహ అడ్డంకులు ఏర్పడుతాయని అందరూ అంటుంటే వినే ఉంటాం. పెళ్లి కుదర్చే ముందు.. వధూవరుల జాతకాల పొంతన చూడటం సహజం. మంచి నక్షత్రమా.. ఎన్ని పొంతనలు ఉన్నాయని అడుగుతాం. సాధారణంగా నక్షత్ర పొంతన చూడటం చాలా మంది అలవాటు. దశా-దిశలు ఎలా వున్నా.. నక్షత్రాలు పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు.

కుజగ్రహ ప్రభావంతో మాంగల్య దోషం, విష్కన్యాదోషం, కళత్ర దోషం, సర్పదోషం, సూర్య దోషం, పునర్పూ దోషం వంటివి ఏర్పడతాయి. ఇందులో కుజదోషం, సర్పదోషం, మాంగల్య దోషం కీలకమైనవి. ఈ దోషాలంటే తప్పక నివారణ చేసి తీరాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. శరీరంలో రక్త ప్రవాహానికి ఆధారమైన కుజుడు.. శరీరంలోని ఉష్ణాన్ని వెలివేస్తాడు. పురుష జాతకంలో కుజుని గ్రహాధిపత్యం సాధిస్తే ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. మహిళల జాతకంలో కుజగ్రహ అనుగ్రహం ఆధిపత్యం వహిస్తే.. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజునికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీపురుషులు ఒక్కటవడం, వంశావృద్ధికి కుజుడే కారకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానానికి జ్యోతిష్య నిపుణులు ప్రాధాన్యత ఇస్తారు. కుజగ్రహ ప్రభావం ఇరు జాతకులకు ఉంటే.. ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే దోషాలుంటే మాత్రం వివాహ అడ్డంకులు, వివాహ బంధంలో సమస్యలు వంటివి తప్పవని, వీటి నుంచి బయటపడాలంటే... తప్పక దోష పరిహారం చేయాల్సిందేనని వారు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories