Vinayaka Chavithi 2019 Live Updates: కాణాపాక గణపతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Vinayaka Chavithi 2019 Live Updates: కాణాపాక గణపతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
x
Highlights

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం సత్యప్రమాణాలకు నిలయంగా ఉంది. దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ స్వామికి ప్రతీ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి ఆలయం సత్యప్రమాణాలకు నిలయంగా ఉంది. దేశంలోనే ప్రముఖమైన వినాయక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ స్వామికి ప్రతీ ఏడాది నిర్వహించే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులోభాగంగా, వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ వేడుకలు 21 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం తెల్లవారుజాము నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. మరోవైపు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories