History of Tanot Mata Temple : తన్నోట్ మాతా ఆలయం.. అంతుచిక్కని రహస్యాలు

History of Tanot Mata Temple : తన్నోట్ మాతా ఆలయం.. అంతుచిక్కని రహస్యాలు
x
తన్నోట్ మాత ఆలయం
Highlights

History of Tanot Mata Temple : ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు మన భారత దేశంలో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఈ తన్నోట్ మాత ఆలయం కూడా ఒకటి.

History of Tanot Mata Temple : ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ ఆలయాలు మన భారత దేశంలో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఈ తన్నోట్ మాత ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం భారతదేశంలోని పశ్చిమ రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మేర్ జిల్లాలో వుంది. చరణ్ కులంలో జన్మించిన ఆవాద్ దేవతను తనోట్ మాతాగా పూజిస్తారు. పురాతన చరణ్ సాహిత్యం ప్రకారం తానోట్ మాతను ఈ ఒక్క రూపంలోనే కాకుండా హింగ్లాజ్ మాతా, కర్నిమాత రూపాలలో కూడా కొలుస్తారు. ఇంతటి పురాతన ఆలయం కలిగిన తన్నోట్ గ్రామం ఒక వైపున పాకిస్తాన్ సరిహద్దులకు అతి చేరువలో ఉంది. మరో వైపు 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం జరిగిన లోంగెవాలా అనే ప్రదేశానికి కూడా చాలా దగ్గరగా ఉంది. అయితే ఈ ఆలయానికి గురించి చరిత్రలో ఎన్నో గాథలు ఉన్నాయి. ఇక ఈ ఆలయాన్ని అదే విధంగా ఇండో-పాక్ సరిహద్దును చూడాలనుకునే పర్యటకులు దీనికి సంబంధించిన పత్రాలను జిల్లా, సైనిక అధికారుల నుండి ముందుగానే పొందాలి. ఇది ఇప్పుడు భారతదేశంలో పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో చమురు మరియు గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతారు.

ఈ ఆలయం జైసల్మేర్ నగరానికి 122 కిలోమీటర్ల (76 మైళ్ళు) దూరంలో ఉంది. రోడ్డు మార్గాన ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది. ఈ ప్రాంతంలో అధిక సగటు విండ్‌స్పీడ్ ఉంది. తానోట్ రహదారి చుట్టూ ఇసుక దిబ్బలు, ఇసుక పర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఉష్ణోగ్రతలు 49 ° C వరకు ఉండవచ్చు.

చరిత్ర..

ఆ ఆలయంపై 1965 ఇండో-పాక్ యుద్ధం సమయంలో పాకిస్తానీ సైన్యం ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాంతం మీద 3000 బాంబులు పేల్చింది. కానీ అమ్మవారి మహినావ్విత శక్తుల కారనంగా ఆలయానికి ఎటువంటి నష్టం జరగలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న పాకిస్తానీ జనరల్ ఇన్ని బాంబులు వేసినా ఆలయం చెక్కుచెదరక పోవడంతో ఈ ప్రాంతంలో వున్న ఆలయాన్ని రక్షించిన శక్తిని చూసి దాని గురించి తెలుసుకొనుటకు భారతదేశానికి వచ్చారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యుద్ధం అనంతరం ఆలయ నిర్వహణ భారతీయ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి ఆలయాల రక్షణను బిఎస్ ఎఫ్ సైనికులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఆలయంపైన వేసిన మూడు వేల బాంబుల్లో పేలని బాంబులను సేకరించి అక్కడి మ్యూజియంలో భద్రపరిచారు.

ఆలయం చేరుకోవటం ఎలా..

ఆలయం జైసల్మేర్ నగరం నుండి 153 కిలోమీటర్లు (95 మైళ్ళు) వుంది. చేరుకోవడానికి సుమారు రెండు గంటలు పడుతుంది.

సందర్శన చేయగల సమయం..

ఇక ఈ ఆలయంలో దర్శనానికి కేవలం మూడు నెలలు మాత్రమే సాధ్య పడుతుంది. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా లేనప్పుడు నవంబర్ నుండి జనవరి నెలల వరకు సందర్శించవచ్చును. టాక్సీలలో ప్రయాణం చేయవచ్చును.




Show Full Article
Print Article
Next Story
More Stories