History Of Talpagiri Ranganatha Swamy: మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది ఈ ఆలయంలోనే

History Of Talpagiri Ranganatha Swamy: మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించింది ఈ ఆలయంలోనే
x
Highlights

History Of Talpagiri Ranganatha Swamy: ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి.

History Of Talpagiri Ranganatha Swamy: ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం నెల్లూరు పట్టణంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున కొలువైంది. ఇక్కడ రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. ఇక్కడ శ్రీరంగనాథ్ స్వామి ఆలయాన్ని దర్శించగలం. విశాలమైన ఆలయ ప్రాంగణమునకు తూర్ప దిశలో ఏడు అంతస్ధుల రాజగోపురం ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ప్రధానాలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయంనకు పశ్చిమ వైపున పెన్నానది ప్రవాహించు చున్నది. దీనిని పినాకినీ నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచారించి దైవ దర్శనముకు భయులు దేరుతారు. ప్రధానాలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయంలో శేషుతల్పం పై శయనముద్రలో శీ రంగనాథడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. స్వామి పాదాల వద్ద శ్రీదేవి - భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుటూ ప్రదక్షిణ గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.

12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది.ఈ గాలి గోపురంపై భాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి.

♦ క్రీ.శ. 7,8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతోంది. 12 వ శతాబ్దం లోని రాజరాజనరేంద్రుడు, ఉభయ కుళోత్తుంగ ఛోళుడు గోదావరి, కావేరీ నదుల మధ్యభాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ, ప్రాకారాదులను నిర్మింపచేశారు

♦ .క్రీ.శ 1879 వ సంవత్సరంలో శ్రీ యెరగడిపాటి వెంకటాచలం పంతులుగారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మింపచేశారు.

♦ సుమారు 100 సంత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారం తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాలమండపాన్ని బహూకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు.

♦ గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి వుంచుతారు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

♦ ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ కు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.

ఈ ఆలయము ఎక్కడున్నది ?

ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం ఉంది. రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.

స్థలపురాణం,

మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ పౌండరీక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిఢవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథస్వామిగా వెలశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోనుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీరంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మరోటి వేదగిరి నరసింహస్వామి క్షేత్రంగా వెలసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది.

పూజలు.. ఉత్సవాలు..

నిత్య పూజా కార్యక్రమాలు జరిగే ఈ ఆలయంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో పైకప్పుకు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా ఉండి, మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది

దర్శన సమయం..

ఆలయం దర్శనం ఉదయం 6:30 నుంచి 12 గంటలు తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటలు వరకు దొరుకుతుంది.

రవాణా సౌకర్యం..

రైలు విజయవాడ - గూడూరు రైలు మార్గములో నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు పశ్చిమ & తూర్పు ప్రవేశ ద్వారములున్నాయి. పశ్చిమ ప్రవేశ ద్వారంనకు సుమారు ఒక కీ.మీ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆటోలు దొరుకుతాయి. బస్సు రాష్ట్రం లోని అన్ని ప్రాంతములు నుంచి నెల్లూరుకు బస్సులు ఉన్నాయి. నెల్లూరులో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి. RTC మెయిన్ బస్ స్టాండు & ఆత్మకూరు బస్ స్టాండ్. ఆలయం నకు ఆత్మకూరు బస్ స్టాండ్ కొంత దగ్గరవుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories