సముద్రంలో కలవని పుణ్యనది ఏదో తెలుసా

సముద్రంలో కలవని పుణ్యనది ఏదో తెలుసా
x
Highlights

భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు...

భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతిలో భాగమై పోయినవి. వర్షపు నీటి వలన కాని, ఎత్తయిన పర్వతాలలో మంచు కరిగిన నీటి వలన కాని చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించబడుతుంది. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. మరి కొన్ని నదులు సముద్రంలో కలిసి పోతాయి. కానీ ఒక నది మాత్రం అటు భూమిలో ఇంకిపోకుండా, ఇటు సముద్రంలో కవలకుండా అలా పారతూ ఉంటుంది. అదే యమునా నది. ఈ యమునా నది తీరంలోనే పావనమైన కురుక్షేత్రం ఉంది, ఈ యమునా నది తీరంలోనే బృందావనం ఉంది. యమున, హిమాలయ పర్వతాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రములో, హరిద్వార్కు ఉత్తారాన ఉన్న యమునోత్రి వద్ద ఉద్భవిస్తుంది. ఈ నది ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి అలహాబాద్ ప్రయాగ క్షేత్రంలో గంగానదిలో కలుస్తుంది.

పురాణాల్లో ప్రస్థావన

ఇప్పుడు చూస్తున్నటు వంటి యమునోత్రి అనే భాగంలో అసిత ముని అనే ఒక మహర్షి తప్పస్సు చేసుకుంటే ఉండే వారంట. ఆయన ప్రతి రోజు గంగానదకి వెళ్లి స్నానం చేసేవారంట. అయితే వృద్దాప్యం వల్ల ఆయన గంగానదికి వెళ్లి స్నానం చేయలేక పోవడం వలన గంగా నదియే తన ఒక పాయను ఆ మహర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరగా ప్రవహింపచేసింది. ఇంతకు పూర్వమే సూర్యుని పుత్రిక అయినటువంటి యమున ఛాయాదేవి యొక్క శాపం వలన భూలోకంలో ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ భూలోకంలో యమునోత్రి దగ్గర నుంచి ప్రవహించే యమునా నది పక్కనే గంగ కూడా ప్రవహిస్తుందట. అయితే గంగకు ఎలాంటి పవిత్రత ఉందో అదే విధంగా పవిత్రత, పావనత వచ్చాయి. అందుకే గంగ తరువాత, యమునా నదిని పలుకుతారు.

మరో కథనం

భాగవత పురాణంలో శ్రీకృష్ణుని బాల్యంలో చాలా చోట్ల దీని ప్రస్తావన ఉంది. కృష్ణుని తండ్రియైన వాసుదేవుడు కంసుని బారినుంచి తన కుమారుడిన కాపాడటానికి ఈ నదిని దాటవలసి వస్తే అది రెండు పాయలుగా చీలి దారి ఇచ్చిందని ఉటంకించబడి ఉంది. భరతుడు, అంబరీషుడు, శంతనుడు మొదలైన చక్రవర్తులు ఈ నది ఒడ్డున ఎన్నో పుణ్యకార్యాలు నిర్వర్తించారు. అగస్త్య మహర్షి కూడా దీని ఒడ్డున పూజాదికాలు నిర్వహించేవాడని హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి.

యమునా నది జమ్నా ఉత్తర భారతదేశములో గంగానది యొక్క అతిపెద్ద ఉపనది. ఈ నది గంగా నదికి ఎడమవైపున పుట్టి గంగా నదిని కుడివైపు నుండి కలిసే ఏకైక ఉపనది. 1370 కిలోమీటర్ల పొడవున్న ఈ నది భారతదేశపు నదులలో ప్రముఖమైనది, పవిత్రమైనది. హిమాలయ పర్వతశ్రేణులకు చెందిన కాళింది పర్వతంలో యుమునోత్రి అనే స్థలంలో ఈ నది జన్మించింది. ఋగ్వేదంలో గంగానదితో పాటు దీన్ని గురించిన ప్రస్తావన కూడా ఉంది. దీనికే సూర్య తనయ అనీ సమానశ్వాస అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనదిలో సంవత్సరమంతటా ప్రవహించే నీటి పరిమాణం, దిశ దాదాపు స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే మహామేళా, 12 సంవత్సరాల కొకసారి నిర్వహించే కుంభమేళకు విశేష సంఖ్యలోభక్తులు హాజరవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories