మంగళవారం హనుమ పూజ మహిమాన్వితం

మంగళవారం హనుమ పూజ మహిమాన్వితం
x
Highlights

మంగళవారం హనుమంతుడిని ప్రార్థిస్తే ఐహిక సుఖాలు పొందుతారు. నైవ యోజ్యోరామ మంత్ర: కేవలం మోక్షసాధకః ఐహికే నమను ప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం రాముని...

మంగళవారం హనుమంతుడిని ప్రార్థిస్తే ఐహిక సుఖాలు పొందుతారు.

నైవ యోజ్యోరామ మంత్ర: కేవలం మోక్షసాధకః

ఐహికే నమను ప్రాప్తే మాం స్మరేత్ రామసేవకం

రాముని స్మరిస్తే కేవలం కైవల్యం మాత్రం దొరుకుతుంది. ఈలోగా జరగవలసిన ఐహికకర్మలలో కష్టాలు ఎదురైతే, రామసేవకుడయిన నన్ను తలవండి, మీకు సాయపడతానని ఆయన అభయమిచ్చాడు. సూర్యుడు ఆకాశంలో వెలుగుతాడు. కానీ ఆ వెలుగు చీమమీద, గడ్డిపోచ మీద కూడా ప్రసరించి వాటికీ జీవమిస్తుంది. అదే రకంగా భక్తుడైన హనుమంతుడు సమస్తజీవులకు ఐహికసుఖాలను అందజేయగలుగుతాడని తత్త్వం చెబుతున్నది. ఆ తర్వాతే ఆధ్యాత్మిక పరమయిన ముక్తికి కూడా మార్గం చూపించగలుగుతాడు.

హనుమంతుడు పరమాత్ముడైన శ్రీరామచంద్రుని పట్ల ప్రదర్శించిన భక్తిభావంలోనే ఈ అంశం విశదమవుతుంది. ఆ భక్తిలో దేహభావం, ఆత్మభావమనే మూడు అంచెలున్నాయి. రామబంటు అయిన హనుమంతుడిని మంగళవారం ప్రార్థించిన సకల జ్ఞానం లభించి, ఆ రోజు తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories