Hanuman Jayanti: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు

Hanuman Jayanti Celebrations Across the Country
x

Hanuman Jayanti: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు

Highlights

Hanuman Jayanti: భక్తులతో కిటకిటలాడుతున్న హనుమ క్షేత్రాలు

Hanuman Jayanti: ఇవాళ హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. చాంద్రమానం ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున హనుమ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నిస్వార్థ సేవ, భక్తి, విధేయతకు చిహ్నంగా భావించే హనుమ భక్తరక్షకుడిగా పేరు ఉంది. ఎంతటి లక్ష్యానైనా ఆత్మవిశ్వాసంతో సాధించడం హనుమ విశిష్ట లక్షణం. హనుమ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో ఉన్నారు.

స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో స్వామికి ఇష్టమైన ఆకుపూజలు, వడమాల పూజలు నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయాలన్నీ హనుమ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ భక్తులు హనుమ ఆలయాలకు విచ్చేసి హనుమ అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎటుచూసినా భక్తుల కోలహలంతో ఆలయాలన్నీ సందడిగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories