Hanuman Jayanti: ఆజన్మ బ్రహ్మచారి ఆంజనేయుని కుమారుడి గురించి తెలుసా?
Hanuman Jayanti: రాముని దూతగా లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ దూత సందేశం నచ్చని రావణాసురుడు అతని తోకను నిప్పంటించమని ఆదేశిస్తాడు.
Hanuman Jayanti: ''శ్రీరామ'' అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ''హనుమంతుడు''. ఏడుకాండల గ్రంధమయిన ''రామాయణం''లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ''కిష్కింధాకాండ''లో ప్రవేశించిన ''హనుమంతుని పాత్ర'' నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. శ్రీరామనవమిని తన సురక్షితంగా జరుపుకున్న ప్రజలు హనుమంతుడి జన్మదినం జరుపుకోవడానికి సిద్దమైయ్యారు.
హనుమంతుడు ఎవరు?
హనుమంతుడు, మారుతి, ఆంజనేయుడు ఇలా అనేక రకాల పేర్లతో ఈ చిరంజీవిని పిలుస్తుంటారు. మారుతి హిందూ నెల చైత్రం మాసంలో వచ్చే పూర్ణిమ తిథి (పౌర్ణమి రోజు) లో జన్మించాడని నమ్ముతారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమాన్ జయంతిని పాటించనున్నారు.
హనుమంతుడి జననం:
హనుమంతుడు మాతా అంజని మరియు కేసరికి దంపతులకు జన్మించాడు. అతను శివుని అవతారం అని నమ్ముతారు. మరియు వాయు దేవుడు, శివుని ఆశీర్వాదాలను అంజనికి పంపినప్పటి నుండి, హనుమంతుడిని పవన్ పుత్ర అని కూడా పిలుస్తారు.
ఆదిత్యుడే ఆచార్యుడు
హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ''నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?'' అన్నాడు సూర్యుడు. ''గురుదేవా… మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను''అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ. ఈ కథను… జాంబువంతుడు…. సాగర తీరంలో వానరులకు వినిపించాడు.
హనుమంతుడు నాలుగు వేదాలలో ప్రావీణ్యం సంపాదించాడు. అతను తెలివైనవాడు, తెలుసుకోగలిగినవాడు, అంకితభావం గలవాడు, నిబద్ధత గలవాడు మరియు శక్తివంతుడు అని ప్రశంసించబడ్డాడు. శ్రీ రాముడి భక్తుడైన మాతా సీతను అపహరించిన రాక్షస-రాజు రావణుడిని హెచ్చరించడానికి అతను లంకా రాజ్యం మొత్తానికి నిప్పంటించాడు.
రామునితో పరిచయం:
సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణఉలు ఋష్యమాకం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు పరుగులు తీసాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు… సుగ్రీవునికి ధైర్యంచెప్పి… యతిరూపం ధరించి రామలక్ష్మణల దగ్గరకు వచ్చాడు. దానితో అతను రాముడి యొక్క అత్యున్నత భక్తుడి హోదాను సంపాదించాడు.
సీతాదేవి ఇచ్చిన ముత్యాల హారాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ తిరస్కరించాడు. అతను దానిని ఇలా వివరించాడు, శ్రీ రాముడు లేని ప్రతిదాన్ని తాను తిరస్కరిస్తానని చెప్పాడు. అందువలన, అలా చెప్పడం ద్వారా, అతను వర్తమానాన్ని తిరస్కరించాడు. బదులుగా, అతను తన ప్రభువువైనా శ్రీరాముడు మరియు సీతాదేవిని తన హృదయాన్ని ఎలా ఆక్రమించాడో చూపించడానికి అతని ఛాతీని చీల్చి చూపించాడు.
ఎరుపు రంగు కారణంగా హనుమంతుడు రుద్ర భగవానుడి అవతారం అని నమ్ముతారు. అతను ఎరుపు రంగును ప్రేమిస్తాడు, భక్తులు సింధూరంతో విగ్రహానికి రంగు వేస్తారు. హనుమాన్ జయంతిపై భక్తులు నుదుటిపై సిందూరం పెట్టుకుని హనుమాన్ ఆలయాలను సందర్శిస్తారు. వారు అరటిపండ్లను కోతులకు తినిపిస్తారు మరియు పురుషులు రోజంతా ఉపవాసం ఉంటారు. హనుమంతుడిని శనిమహాత్మ అని కూడా అంటారు. అతని నల్ల రంగు శనిమహాత్ముని యొక్క గుర్తుగా సూచిస్తుంది. హనుమంతుడు ఆశీర్వాదం పొందటానికి చాలా మంది భక్తులు శనిమహాత్మని మరియు శ్రీరాముడిని ఆరాధిస్తారు. తమ జాతకంలో శని ఉన్నవారు హనుమంతుడిని పూజించాలని నమ్ముతారు.
హనుమంతుని వివాహం:
వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది. హనుమంతుడిని అస్కలిత బ్రహ్మాచారి అని అంటారు.
హనుమంతుడి కుమారుడు:
రాముని దూతగా లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ దూత సందేశం నచ్చని రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా... అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు. తోకతో లంక దహానం చేస్తాడు. ఆ తర్వాత లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు.హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఆ విషయం హనుమంతుడు గ్రహించడు.
కొన్నాళ్లకి పాతాళలోకాన్ని రాజు మైరావణుడి భటుల వలలో జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి 'మకరధ్వజురడు' అని పేరు పెడతాడు మైరావణుడు. అతన్ని ద్వారపాలకుడిగా నియమిస్తాడు.
యుద్ధం సమయంలో రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. రావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు. హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. మకరధ్వజుని చూసిన రాముడు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమింస్తాడు. హనుమంతుడి కథలో ఉంటుంది. ఏప్రిల్ 27న హమాన్ జయంతిని సురక్షింతగా జరుపుకోండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire