ఈ పుష్పాలతో ఆంజనేయుడిని పూజించి చూడండి

ఈ పుష్పాలతో ఆంజనేయుడిని పూజించి చూడండి
x
Highlights

ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు....

ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిథి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రంలో, వైధృతౌ మధ్యాహ్న కాలంలో అంజనీదేవికి జన్మించాడు. ఆంజనేయుడు అంజనాదేవి, కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయుని పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనం, మందారం, కడిమి, గజనిమ్మ, పద్మం, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబరం, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలైన పుష్పాలు అంటే ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయునికి ప్రీతికరమైనవి అని పైన వివరించవడిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని పండితులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories