Money Problems: ప్రతిరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి..!

Doing These Things Every Morning Will Solve Money Problems
x

Money Problems: ప్రతిరోజు ఉదయాన్నే ఈ పనులు చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి..!

Highlights

Money Problems: హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి తరచుగా మనీ సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే అతడి వెంట దురదృష్టం పయనిస్తుందని అర్థం.

Money Problems: హిందూ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి తరచుగా మనీ సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే అతడి వెంట దురదృష్టం పయనిస్తుందని అర్థం. అతడు అలవాట్లు, చేసే పనులు సరిగ్గాఉండవు. దీనివల్ల ఎల్లప్పుడు సమస్యల వలయంలో చిక్కుకొని ఇబ్బంది పడుతుంటాడు. సనాతన ధర్మ ప్రకారం ఒక వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి మొక్కను ఆరాధించాలి. ఈ మొక్కకు నిత్యం పూజలు చేసి, ఉదయం, సాయంత్రం నీళ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగిస్తే దరిద్రం తొలగిపోతాయని చెబుతారు. తులసి మొక్కను రోజూ పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నరాలై ఇంటికి సుఖం, ఐశ్వర్యం, శాంతిని చేకూరుస్తుంది.

మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే, డబ్బు కష్టాలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చాలీసా చదవండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి చాలీసా పఠించడం ద్వారా వ్యక్తి అన్ని వ్యాధులు, దోషాలు నయమవుతాయి. అంతే కాదు ఈ చాలీసా పఠించడం ద్వారా శ్రీ హరి అనుగ్రహం లభిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో తొమ్మిది గ్రహాలు బలహీనంగా ఉంటే తులసి చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయాలి. దీనివల్ల తొమ్మిది గ్రహాలు శాంతిగా మారుతాయి.

ఎవరికైనా వివాహంలో ఆటంకాలు ఎదురైతే తులసి చాలీసా పారాయణం చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు ఉంటాయి. తులసి మొక్కలో తల్లి లక్ష్మి నివసిస్తుంది. ప్రతిరోజు తులసీ చాలీసా పారాయణం చేయడం వల్ల లక్ష్మీమాత ప్రసన్నురాలై అనుకున్న కోరికలను నెరవేర్చుతుంది. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తే వ్యక్తి అన్ని సమస్యలు తొలగిపోతాయి. రోజూ నీటిని అందించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆదివారం మాత్రం తులసి మొక్కను తాకకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories