Palm Astrology: చేతిలో ఇలాంటి గీతలతో బాధలే ఎక్కువ.. దశ తిరగాలంటే మాత్రం ఇవి ఉండాల్సిందే..!

Do you Have These Lines in Your Hand Check Full Details Palmistry
x

Palm Astrology: చేతిలో ఇలాంటి గీతలతో బాధలే ఎక్కువ.. దశ తిరగాలంటే మాత్రం ఇవి ఉండాల్సిందే..!

Highlights

Palm Astrology: హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రంలో చేతి రేఖలతో వ్యక్తుల స్వభావం, గతం, భవిష్యత్తు మొదలైన వాటి గురించి చాలా తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికంలో ఒక వ్యక్తి చేతిలో మూడు ప్రధాన రేఖలు ఉన్నాయి.

Palm Astrology: హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రంలో చేతి రేఖలతో వ్యక్తుల స్వభావం, గతం, భవిష్యత్తు మొదలైన వాటి గురించి చాలా తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికంలో ఒక వ్యక్తి చేతిలో మూడు ప్రధాన రేఖలు ఉన్నాయి. వాటిలో ఒకటి హెడ్ లైన్. రెండోది లైఫ్ లైన్, మూడోది హార్ట్ లైన్. ముఖ్యంగా లైఫ్ లైన్ తర్వాత హెడ్ లైన్ రెండవ అతి ముఖ్యమైన రేఖగా పేర్కొంటుంటారు. దీనిని బుద్ధి రేఖ అని కూడా అంటారు. హస్తసాముద్రికం ప్రకారం, జీవిత రేఖకు పైన బొటనవేలు, చూపుడు వేలు మధ్య ఉన్న రేఖను హెడ్ లైన్ అంటారు.

హెడ్ లైన్, జీవిత రేఖ కలిసి ఒకే స్థలం నుంచి ప్రారంభమైతే, అలాంటి వ్యక్తి తెలివైనవాడిగా గుర్తింపు పొందుతాడు. అలాగే జ్ఞానవంతుడు. తన కుటుంబానికి గౌరవం ఇచ్చేవాడి పేరు తెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎంతో పురోగతిని సాధిస్తాడు.

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, తల రేఖకు, జీవిత రేఖకు మధ్య స్వల్ప వ్యత్యాసం ఉన్న వ్యక్తులు ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. అలాంటి వ్యక్తులు వారి ధైర్యం, విశ్వాసం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.

హస్తసాముద్రికం ప్రకారం, తల రేఖ చివరిలో హృదయ రేఖకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మంచి వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉంటారు. వారికి ఏదైనా సమస్య ఎదురైతే వారిని ఆదుకునే వారికి కొరత ఉండదు.

హస్తసాముద్రికం ప్రకారం, ఎవరి హెడ్ లైన్ పైకి కనిపిస్తుందో.. అలాంటి వ్యక్తులు కఠినమైన స్వభావం కలిగి ఉంటారు. అలాంటి వారికి ఇతరుల పట్ల అసూయ భావం ఉంటుంది. అందుకే ఇలాంటి వారు జీవితంలో ముందుకు సాగలేరు. హస్తసాముద్రికం ప్రకారం, జీవిత రేఖకు దూరంగా హెడ్ రేఖ ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎవరి ఆలోచనల ప్రభావంతో ఉండరు. వారు స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఆత్మగౌరవం గల వ్యక్తులుగా రాణిస్తుంటారు.

హస్తసాముద్రిక జ్యోతిష్యం ప్రకారం, ఎవరి హెడ్ లైన్ జీవిత రేఖను ఎక్కువుగా డామినేట్ చేస్తే అలాంటి వారి జీవితం చింతలలో మునిగిపోతుంది. మరోవైపు, అరచేతిలో రెండు బ్రెయిన్ లైన్స్ ఉన్న వ్యక్తుల మానసిక సామర్థ్యం చాలా బలంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎంతో అభివృద్ధి చెందుతారు.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఇది వ్యక్తుల నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని పాటించాలంటే మాత్రం నిపుణులను సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories