Cooking Rules: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. ఇంట్లో కష్టాలు మొదలవుతాయి..!

Do Not Make These Mistakes While Cooking According to Hindu Tradition Trouble Starts at Home
x

Cooking Rules: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు.. ఇంట్లో కష్టాలు మొదలవుతాయి..!

Highlights

Cooking Rules: హిందూ సంప్రదాయం ప్రకారం వంట వండేటప్పుడు, వండిన ఆహారం తినేటప్పుడు కొన్ని పద్దతులు ఉన్నాయి.

Cooking Rules: హిందూ సంప్రదాయం ప్రకారం వంట వండేటప్పుడు, వండిన ఆహారం తినేటప్పుడు కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటి ప్రకారమే నడుచుకోవాలి లేదంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. హిందూమతంలో ఆహారాన్ని దేవతగా పూజిస్తారు. అందుకే తినేటప్పుడు మాత్రమే కాకుండా, తయారుచేసేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి. సరైన పద్దతులు పాటిస్తే ఆ ఇంట్లో అన్నపూర్ణా మాతా ఆశీస్సులు ఉంటాయి. ఆహారానికి ఎటువంటి లోటు ఏర్పడదు. అయితే ఎలా వండాలి ఎలా తినాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం.

వంట నియమాలు

హిందూ విశ్వాసాల ప్రకారం వంట చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. ఆహారాన్ని తయారుచేసే ముందు సదరు వ్యక్తి శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. తర్వాత ఆహారాన్ని సంతోషకరమైన హృదయంతో వండాలి. ఆహారం ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ప్రదేశంలో తయారుచేయాలి.

భోజన మంత్రం జపించాలి

హిందూ విశ్వాసం ప్రకారం ఆహారం తినే ముందు ఆహార దేవతకి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇందుకోసం భోజన మంత్రాన్ని పఠించమని పురాణాలలో చెప్పారు.

కుడి చేతితో తినాలి

హిందూ విశ్వాసాల ప్రకారం భోజన సమయంలో ఆహారాన్ని ఎప్పుడూ అవమానించకూడదు. ఆహారం ఎల్లప్పుడూ కుడి చేతితో తినాలి. ఎడమ చేతితో తినడం పెద్ద తప్పుగా భావిస్తారు.

ఆహారం ఏ సమయంలో తినాలి

సనాతన హిందూ ధర్మం ప్రకారం ఏ పని చేయాలన్నా శుభ ముహూర్తం చూసుకోవాలని చెప్పారు. ఈ పరిస్థితిలో ఆహారాన్ని ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన దిశలో కూర్చొని తీసుకోవాలి. తూర్పు దిశను దేవతల దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం శుభప్రదం.

ఆహారం దానం చేయాలి

ఇంట్లో ఆహారం, డబ్బు నిల్వలు పెరగాలని కోరుకుంటే ఎల్లప్పుడూ వాటిని దానం చేయాలి. హిందూ విశ్వాసాల ప్రకారం అన్నదానం గొప్ప దానంగా చెబుతారు. జంతువులు, పక్షుల కోసం ప్రతిరోజూ ఆహారం అందించాలి.

ఆహారం తినే నియమాలు

హిందూ విశ్వాసం ప్రకారం టేబుల్ మీద కూర్చొని ఆహారం తీసుకోవాలి. తినగలిగినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్‌లో మిగిల్చకూడదు. మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదు. తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడగకూడదు. దీనివల్ల సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి, ఆహార దేవత అన్నపూర్ణ కోపించి దూరంగా వెళ్లిపోతారు. మనిషి శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. ఆహారం ప్రశాంతంగా తినాలి. భోజనం చేసేటప్పుడు గొడవ పడకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories