Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనవద్దు.. దారిద్య్రం వెంబడిస్తుంది..!

Do Not Buy These Things At All On Akshaya Tritiya Day Poverty Will Follow
x

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులు కొనవద్దు.. దారిద్య్రం వెంబడిస్తుంది..!

Highlights

Akshaya Tritiya: ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం, 10 మే 2024న వస్తుంది.

Akshaya Tritiya: ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం, 10 మే 2024న వస్తుంది. ఈ రోజున ఏ శుభ ముహూర్తం చూడకుండానే శుభకార్యాలను చేయవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ వైశాఖ మాసం లోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు వస్తుంది. అక్షయ తృతీయ రోజు వివాహం, నిశ్చితార్థం, గృహ ప్రవేశంతో సహా అన్ని రకాల శుభకార్యాలను చేసుకోవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కరూ బంగా రం కొనడానికి మొగ్గుచూపుతారు. ఎందుకో తెలుసుకుందాం.

అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు బంగారం, వెండి కొంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, ఆనందం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఏడాది పొడవునా ఆర్థిక సంక్షోభం ఉండదంటారు. సంపద, కీర్తి, పెరుగుతుందని విశ్వాసం. అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజునే కుబేరుడు నిధిని పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

అక్షయ తృతీయ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్, ఇనుము మొదలైన వాటితో తయారు చేసిన పాత్రలు, వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల రాహువు ప్రభావం ఎక్కువగా ఉండి ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories