Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/1/2025)

Daily Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (7/1/2025)
x
Highlights

Daily Horoscope Today In Telugu, January 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

Daily Horoscope Today In Telugu, January 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, పుష్య మాసం, దక్షిణాయనం, హేమంత రుతువు, శుక్ల పక్షం

తిధి : అష్టమి సాయంత్రం గం.4.26 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: రేవతి సాయంత్రం గం.5.50 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.33 ని.ల నుంచి గం.5.04 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : ఉదయం గం.9.04 ని.ల నుంచి గం.9.49 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.10 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.01 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.10 ని.ల నుంచి గం.4.40 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.6.49 ని.లకు

సూర్యాస్తమయం :సా. గం. 6.04 ని.లకు

మేషం : పనులు ఆశించిన రీతిలో జరగవు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బద్ధకాన్ని వదిలి కష్టపడితే సానుకూల ఫలితం లభిస్తుంది. క్రమం తప్పిన భోజనం మంచిది కాదు. బంధువులతో వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి.

వృషభం : శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కీలక వ్యవహారంలో మిత్రుల సహకారం ఉపకరిస్తుంది.

మిథునం : దూర ప్రాంతంలో స్థిరనివాసానికి చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. మేలిమి అవకాశాలు కలిసివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందుకు హాజరవుతారు. అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి.

కర్కాటకం: గొడవలకు దూరంగా ఉండండి. లక్ష్యాన్ని సాధించడంపైనే దృష్టి పెట్టండి. న్యాయ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మేలు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శించే సూచన ఉంది.

సింహం : వ్యవహారాలన్నింటిలో ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనవసర పోటీలతో నష్టపోతారు. పెట్టుబడులకు అనుకూలం కాదు. తగాదాలకు దూరంగా ఉండండి.

కన్య : చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

తుల : పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వివాదాలు తొలగిపోతాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. అదృస్టం తోడుగా నిలుస్తుంది. కీర్తి పెరుగుతుంది. మానసిక వేదన తగ్గుతుంది.

వృశ్చికం : బద్ధకం వల్ల సమస్యలు వస్తాయి. అభీష్టం నెరవేరదు. ఇతరులతో విరోధం పెరుగుతుంది. కీలక నిర్ణయాలో జాగ్రత్త. మీలోని శక్తిసామర్థ్యాలకు తగినంత గుర్తింపు ఉండదు. వాత సంబంధ సమస్య వేధిస్తుంది.

ధనుస్సు : స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా సాగవు. హడావుడి నిర్ణయాల వల్ల నష్టపోతారు. ఆలోచనలను అదుపు చేసుకోండి. అవసరమైన సౌకర్యాలు సమకూరవు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వృథా ఖర్చు తగ్గించండి.

మకరం : వ్యవహార జయం ఉంది. ధైర్యం పెరుగుతుంది. మీ నిర్ణయాలను మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులతో కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది.

కుంభం : కుటుంబ వ్యవహారాలు ఆందోళన పరుస్తాయి. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. రెండో పెళ్లి ప్రయత్నం అనుకూలించదు. విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచన ఉంది. వృథా ఖర్చులను తగ్గించాలి.

మీనం : అదృష్టం వరిస్తుంది. ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. గౌరవం పెరుగుతుంది. పురోభివృద్ధికి వేసే ప్రణాళికలు అనుకూలిస్తాయి. వాహనయోగం ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులో పాల్గొంటారు.

శుభమస్తు

Show Full Article
Print Article
Next Story
More Stories