Daily horoscope: ఈరోజు మీరోజు! జూలై 16 రాశిఫలాలు!

Todays horoscope panchangam rashiphalalu
x
Today horoscope (representational image)
Highlights

Daily horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!

మేషం

ఈరోజు ఏ పనైనా చేసేముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పనులు మీకు మానసికోల్లాసాన్నిస్తాయి. మీకు ఈరోజు సానుకూలత ఎక్కువగానే ఉంది. ఇక మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది.

ఈరోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మరింత సానుకూలత కనిపించే అవకాశం ఉంది.

వృషభం

ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించగలిగే అవకాశం వస్తుంది. ఒక పెద్ద ఫంక్షన్ లేదా మీటింగ్ లో మీరు పాల్గొనే అవకాశాలున్నాయి. అవి కుటుంబపరంగా లేదా వృత్తి పరంగా అయినా కావచ్చు. మీకు ఆ కార్యక్రమం ద్వారా పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయం కలిగే అవకాశం ఉంది. ఈ పరిచయం మీ భవిష్యత్తులో కీలకంగా మారొచ్చు. మీరు ఈరోజు స్నేహితులతో కాలక్షేపం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీనివలన మీ జీవిత భాగస్వామితో మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.

మీరు ఈరోజు బంగారం ధరించడం లేదా బంగారు వర్ణపు దుస్తులు ధరించడం కలిసి రావచ్చు.

మిథునం

ఆర్థికంగా అంత బాగోకపోవడంతో కుటుంబంలో కొంత అసంతృప్తి నెలకొని ఉంటుంది. మీరు పరిస్థితులను సమర్ధంగా ఎదుర్కోవడానికి ధ్యానం, యోగా మీకు సహకరిస్తాయని భావిస్తారు. కొంతవరకూ వాటి వలన మీకు మానసిక స్వాంతన చేకూరే అవకాశం ఉంది. మీకు ఈరోజు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా సహాయం లభిస్తుంది. ఈ సహాయంతో మీరు చాలా వరకూ ఇబ్బందుల్ని దాటగలిగే ఆత్మస్థైర్యం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చక్కని కాలక్షేపం చేయగలుగుతారు.

ఆకుపచ్చని వాహనం పై ప్రయాణం మీకు మేలు చేసే అవకాశాలున్నాయి.

కర్కాటకం

ఈరోజు ఈ రాశి వారు కొంత బిజీగా ఉంటారు. కుటుంబంలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందుల వలన ఈరోజు పనులలో కొంచెం టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు మొత్తమ్మీద కొంత టెన్షన్ తో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు

తెల్లని దుస్తులు ఈరోజు ఈరాశివారికి కాస్త ఉపశమనం కలిగించవచ్చు

సింహం

ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు. అప్పులు తిరిగి తీర్చేయాలని అనుకున్నా అందులోనూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం మీకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచింది. జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. సమ్యమనంతో వ్యవహరించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది.

ఈరోజు పూర్తిగా ఉప్పును మీ ఆహారంలో లేకుండా చూసుకోవడం..ఉప్పును వాడకుండా ఉండడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంది.

కన్య

మీరు గతంలో మీకెదురైన అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలు ఈరోజు మీకు చాలావరకూ అక్కరకోస్తాయి. అటు వృత్తిలోనూ, ఇటు కుటుంబంలోనూ మీ ఆ అనుభవాలతోనే మీరు చాకచక్యంగా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మీకు వచ్చిన సమస్యలు కాస్త టెన్షన్ పెట్టినా, ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు.

ఈరోజు సమాజసేవ ఏదైనా చేయండి అది మీకు మరింత మానసికోల్లాసాన్ని ఇస్తుంది.

తుల

ఈరోజు తులా రాశి వారికీ కాస్త ఇబ్బందికరంగానే గడుస్తుందని చెప్పవచ్చు. పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి.. ఇంట్లో తలెత్తే ఇబ్బందులు మిమ్మల్ని ఒత్తిడిలో పడేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా వాటిని అధిగమించాల్సి ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అంత అనుకూల సమయం కాదు. జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది. మీరు ఈరోజు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. అది మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది.

ఆధ్యాత్మిక ప్రాంతాల్లో నెయ్యి, కర్పూరం విరాళంగా ఇవ్వడం ద్వారా మీకు మేలు జరిగే అవకాశాలున్నాయి.

వృశ్చికం

ఆర్దికపరమైన ఒత్తిడితో రోజు ప్రారంభం అవుతుంది. అయితే, సాయంత్రానికి ఆ ఇబ్బందులు చాలావరకూ తొలిగిపోతాయి. దానికి అనుగుణంగా మీ ప్రణాళికలు సాగుతాయి. భవిష్యత్ కోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఒత్తిడి తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాలను ఎంచుకుంటారు. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు చాలా సంతోషంగా గడప గలుగుతారు.

బియ్యం, చక్కెర, పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను ఈరోజు దానం చేయడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంది.

ధనుస్సు

ఈరోజు మీరు మంచి సందేశాన్ని వింటారు. అది మీకు అన్నిరకాలుగానూ ఉత్సాహాన్నిస్తుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఖర్చులను నియంత్రిన్చుకోవాల్సి ఉంటుంది. మీ బంధువు ఒకరిని చూడటానికి వెళ్ళడం మీకు సౌకర్యాన్ని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకు ఈరోజు ఉల్లాసంగా గడుస్తుంది.

ఈరోజు మద్యపానం, మాంసాహారం తీసుకోకపోవడం మీకు మంచి చేస్తుంది.

మకరం

పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీరు కచ్చితంగా కొంత విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందరూ మీకు రకరకాల సలహాలు ఇవ్వడం మీకు చికాకును కలిగిస్తుంది. కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగామించాగాలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తారు.

ముడి పసుపు, కుంకుమ, పసుపు, గంధం వీటిని ధరించడం..ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా కొంత రిలాక్సింగ్ గా అనిపించే అవకాశం ఉంది.

కుంభం

ఈరోజు కుంభ రాశి వారికి సంతానం ద్వారా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉండే చాన్స్ ఉంది. ఇతరులపై ఖర్చు చేయడం మీకు కొంత నష్టాన్ని చేకూరుస్తుంది. పనిలో వచ్చే మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో మాట్లాడటంతో మీరు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామీతో రిలాక్స్ గా ఉంటారు.

వినాయకుడు లేదా విష్ణు ఆలయంలో దీపం వెలిగించడం ద్వారా మీకు మంచి జరగవచ్చు

మీనం

వృత్తిలో మీరు పడుతున్న కష్టాన్ని మీ అధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీకు వారినుంచి సానుకూల సంకేతాలు అందడం కొండంత బలం ఇస్తుంది. ఇక మీ అనవసర ఖర్చుల విషయంలో మీ జీవిత భాగాస్వామితో కొంత విబేధాలు వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి. మీ సమయాన్ని వృధా చేసే మిత్రులకు దూరంగా ఉండడం ద్వారా మీ వైవాహిక జీవితం మరింత చక్కగా మారుతుంది.

ఆసుపత్రిలో ఉన్న రోగులకు వీలైనంత సహాయం చేయండి. ఇది మీకు మానసికోల్లాసాన్నిస్తుంది.

ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి! ఇది అందరికీ చెప్పదగిన సూచన

Show Full Article
Print Article
Next Story
More Stories