Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు ఉత్తమ కార్యాచరణ ద్వారా విజయకేతనం ఎగురవేస్తారు.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 25th April
x

Todays Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

నేటి రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| ఆదివారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: శుభప్రదమైన కాలం. పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మిత్రుల బలం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరమైన జీవితం లభిస్తుంది. అంతా కోరుకున్నట్టుగా జరుగుతుంది. మీరు తీసుకునే సాహస నిర్ణయం నలుగురికీ మేలు చేస్తుంది. సూర్య నారాయణమూర్తిని స్మరించండి. సమస్యల నుండి బయటపడతారు.

వృషభం: కాలం సహకరించడం లేదు. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ వహించండి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. నిరంతరంగా పనిచేస్తూనే ఉండాలి. తప్పకుండా సత్ఫలితం వస్తుంది. ధైర్యం చాలా అవసరం, పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద తప్పులాగా అనిపిస్తుంది.

మిథునం: ఉత్తమ కార్యాచరణ ద్వారా విజయకేతనం ఎగురవేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అష్టమ శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. మంచి పనులు చేసి మెప్పు పొందుతారు. వృత్తిలో నైపుణ్యముంటుంది. అధిక లాభాలు వస్తాయి. అంతా కోరుకున్నట్టే జరుగుతుంది. వ్యయం తగ్గించండి. గృహయోగం ఉంది. ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మంచిది.

కర్కాటకం: ధనలాభం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్ర సమాగమంతో ఆనందం కలుగుతుంది. అధికారుల ద్వారా లాభపడతారు. మీవల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. కల సాకారం అవుతుంది.

సింహం: మంచి ఫలితాలున్నాయి. ఆస్తి పెరుగుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. అదృష్టయోగముంది. ఉద్యోగంలో శుభ ఫలితం, వ్యాపారంలో మిశ్రమ ఫలితంఉంటాయి. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం.మంచి భవిష్యత్తు ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఒక క్రమ పద్ధతితో ముందడుగు వేయండి.

కన్య: గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. ఆదాయానికీ, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. అనుభవంతో వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోగలరు. వాదాలతో కాలం వృథా కానీయవద్దు. కొంత పరీక్షా కాలంగా అనిపిస్తుంది. ఆదిత్యహృదయం చదవండి. శుభవార్త వింటారు.

తుల: గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నిదానంగా ఆలోచించండి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఈర్ష్యాపరులున్నారు, గోప్యంగా కార్యాలను నిర్వహించండి. ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. విఘ్నాలను అధిగమించాలి. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.

వృశ్చికం: ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. విజయం ప్రాప్తిస్తుంది. కోరికలు నెరవేరతాయి. గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తగినంత మానవప్రయత్నం అవసరం. వస్త్ర ధాన్యాది లాభాలుంటాయి. స్వస్థాన ప్రాప్తి సూచితం. మనోధైర్యం పెరుగుతుంది. కుజశ్లోకం చదవండి, శుభవార్త వింటారు.

ధనుస్సు: లక్ష్యాన్ని చేరుకుంటారు. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ధనలాభం ఉంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది.

మకరం: అదృష్టయోగముంది. తలచిన కార్యాల్లో విజయం లభిస్తుంది. ధఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. డబ్బు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా విజయమూ ఉంటుంది. కొందరు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. ఓర్పు రక్షిస్తుంది. సంతానం ద్వారా అదృష్టవంతులవుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి. అనుకున్నది సాధిస్తారు.

కుంభం: ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. కోరికలు సిద్ధిస్తాయి. స్పష్టతతో ఆలోచించాలి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. సొంత నిర్ణయం మేలుచేస్తుంది. శత్రుదోషముంది. విఘ్నాలను అధిగమిస్తారు. సత్కర్మలను ఆచరించడంతో మంచి భవిష్యత్తు లభిస్తుంది. దుర్గాధ్యానం శుభాన్నిస్తుంది.

మీనం‌: చక్కని భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారలాభం విశేషంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. పదిమందికీ మేలు చేసే పనులు చేపడతారు. సుఖసంతోషాలున్నాయి.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581



Show Full Article
Print Article
Next Story
More Stories