Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| శుక్రవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|
మేషం: ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
వృషభం: ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా నూతన ప్రారంభానికి సమయం సరైంది కావచ్చు. అయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
మిథునం: మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది. విలువైన వస్తువుల కోసం బేరం చేయడానికి ముందు చట్టబద్ధమైన పత్రాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించండి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు.
కర్కాటకం: ఒక వ్యవహారంలో తగిన సహకారం అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభప్రదం. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. సాయంత్రం సమయంలో పాత స్నేహితులను కలిసే అవకాశముంది.
సింహం: మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుంది. పాత స్నేహితుల సమావేశం నూతన ఆశలను రేకెత్తిస్తుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
కన్య: ప్రారంభించబోయే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్నిపాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. పనిభారమంతా మీపైనే ఉంటుంది. మీ జూనియర్ల నుంచి పనిచేయించుకోవాలంటే వారితో ప్రేమతో మెలగాలి. ఇంట్లో వాతావరణం తేలికగా ఉంటుంది.
తుల: మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రేమికుడితో లేదా మరే ఇతర సన్నిహితుడితోనైనా వివాదముం అది చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు.
వృశ్చికం: శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.అనవసర వివాదాల్లో తలదూర్చకండి. ఎందుకంటే నష్టపోయే ప్రమాదముంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. కాబట్టి ఆహారం విషయం సంయమనం పాటించండి.
ధనుస్సు: ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. లేకుంటే ఈ రోజు మీరు పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకునే ప్రమాదముంది.
మకరం: కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
కుంభం: చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. శత్రుపక్షాలు మీ చేతిలో ఓడిపోతారు. నూతన వ్యక్తులతో పరిచయంతో అనుకూల ఫలితాలు ఉంటాయి.
మీనం: పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.
- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ
9381881581
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire