Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు తీసుకునే అకాల నిర్ణయాలు లాభాలనిస్తాయి.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam  Dinaphalaalu Today 21th June
x

Daily Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

ఈ రోజు రాశిఫలాలు

Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| సోమవారం, ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 5.30 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగ, వ్యాపారాల్లో సహచరులపై ఆధారపడాల్సి ఉంటుంది. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచింది. ఇతరులకు రుణాలు ఇవ్వాల్సి వస్తుంది. అనారోగ్య సూచనలు కనపుడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి.

వృషభరాశి: ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో అంత అనుకూలంగా లేదు. పని ప్రదేశాల్లో కూడా జాగ్రత్తగా వుండాలి. కష్టమైన సమస్యలను పరిష్కరించుకుంటారుు. ఈ రోజు ప్రేమ పరంగా అనుకూలంగా ఉటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో విజయంతమవుతుంది.

మిథున రాశి: ఈ రాశి ఈ రోజు మనస్సులో గందరగోళం కొనసాగుతుంది. కార్యాలయంలో ఆర్థిక సంబంధిత విషయాలు విస్మరించబడతాయి. ఫలితంగా ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇతరుల చెప్పేది వినడానికి ఎప్పుడూ వెనకాడరు.

కర్కాటకరాశి: ఈరాశి వారికి ఆరోగ్యం విషయంలో అనియంత్రిత ఆహారం లేదా దినచర్య కారణంగా రోజు ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైన పనులు త్వరితగతిన పూర్తవుతాయి. ఈ రోజు మీకు ప్రేమ పరంగా ప్రేమ, గౌరవం రెండూ లభిస్తాయి. పనులు నెమ్మదిగా జరగడం వల్ల ఆదాయం కూడా తక్కువగా ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీ అజాగ్రత్త కారణంగా సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కలత చెందుతారు. తమలో తామకు విభేదాలు ఉండవచ్చు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం ద్వారా ఆనందకరంగా ఉంటుంది. అయితే మీ ఉదాసీనత వల్ల వాటిని ఆస్వాదించలేరు. కార్యాలయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో సేవకుల పట్ల జాగ్రత్త వహించండి.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎవరితోనూ వాదనలు, గొడవలు పడకండి. వ్యాపారానికి సంబంధించి మీరు సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి చట్టపరమైన అంశాలను పూర్తిగా తెలుసుకోండి. సాయంత్రం సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

తులా రాశి: ఈరాశి వారికి ఈ రోజు అకాల నిర్ణయాలు లాభాలనిస్తాయి. నిరాశ చెందకుండా మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. రోజు ప్రారంభం నుంచి మధ్యాహ్నం వరకు మీరు పనిలో అజాగ్రత్తగా ఉంటారు. ఇతర రోజులతో పోలిస్తే ఈ రోజు మీరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డబ్బు రూపంలో ప్రయోజనాలు ఉంటాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు మీపై చాలా బాధ్యతలు ఉంటాయి. ఇంటి పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీరు మీ బాధ్యతలను తీర్చగలుగుతారు. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కుటుంబ సభ్యుల కారణంగా మీరు కోపంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

ధనస్సు రాశి: ఈ రాశివారు ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. సృజనాత్మక పనిపై కూడా ఆసక్తి పెరుగుతుంది. పాత స్నేహితుడు అకస్మాత్తుగా వచ్చి మీ ముందుకు నిలబడవచ్చు. ఎవ్వరికీ రుణాలు ఇవ్వకండి. ఇంట్లో పెద్దలతో వివాదాలతో వారి అభిప్రాయాన్ని వినడం మంచిది.

మకర రాశి: ఈ రాశి గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటారు. కష్టపడి పనిచేసిన తర్వాత మీరు ఆశించిన విజయం సాధిస్తారు. శుభవార్త రావడం ఉత్సహాన్ని పెంచుతుంది. ఆర్థిక లేదా ఇతర కుటుంబ విషయాలకు సంబంధించి ఇంట్లో ఉద్రిక్తత ఉంటుంది. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం క్షీణిస్తుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు నూతన కార్యక్రమానికి సంబంధించి శక్తి పెరుగుతుంది. ఏదైనా ప్రేమ వ్యవహారం గురించి చాలా ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలో పదోన్నతులు లేదా జీతం పెరుగుతాయి. మీ సామాజిక పరిధి పెరుగుతుంది. అంతేకాకుండా గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఖర్చుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.

మీన రాశి: ఈ రాశి వారు ఈ రోజు వివదాలకు దూరంగా ఉండటం మంచింది. వ్యాపారంలో అనుకూల పరిస్థితులు వున్నాయి. ఆర్థిక విషయాలను ఎవ్వరితో చర్చించవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories