Daily Horoscope: ఈ రోజు మీ రోజు! ఈ రాశి వారు చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి.

Daily Horoscope in Telugu Rasi Phalalu Panchangam Dinaphalaalu today 20th April
x

Todays Horoscope:(File Image)

Highlights

Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు

Daily Horoscope: శ్రీ శార్వరి నామ సంవత్సరం| బుధవారం ఉత్తరాయణం| శిశిర ఋతువు పాల్గుణ మాసం| సూర్యోదయం : 6.01 | సూర్యాస్తమయం సా.6.08| తిథి శు.పాడ్యమి రా.గం.11.04వరకు | తదుపరి విదియ |నక్షత్రం హస్త సా.4.49 వరకు| తదుపరి చిత్త|రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు| వర్జ్యం రా.12.28 నుంచి 1.54 వరకు| దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.17 పున: మ.2.56 నుంచి మ.3.45 వరకు| అమృతఘడియలు ఉ.11.18| కరణం బలువ ప.12.09| యోగం ధృవం రా.7.52 గం.ల వరకు|

మేషం: వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. సామాజిక ప్రదేశంలో ఉపాధి నుంచి కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది. స్నేహితులు, బంధువులతో ప్రయాణాలు సాగించే అవకాశముంది. సాయంత్రం పరిచయస్తుడి సహాయంతో శుభకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం: కొన్ని విషయాల్లో మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. పని ప్రదేశంలో నూతన పథకాలను అమలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం ఉంటాయి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది. రోజు చివర్లో సమస్యలు ఉన్నప్పటికీ శక్తిని పెంచే అవకాశాలు ఉన్నాయి. యువకుల వైవాహిక సమస్యలు కొంతవరకు పరిష్కరించుకుంటారు.

మిథునం:ఆనందకరమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సృజనాత్మక పనిని పూర్తి చేసుకుంటారు. వ్యాపార వృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రేమ వివాహం చేసుకునేవారు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం: బాగా శ్రద్ధగా పని చేస్తే విజయం తప్పక వరిస్తుంది. కార్యాలయంలో వివాదాలు జరిగే అవకాశముంది. వారితో జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కొన్ని సంఘటనల వల్ల ఉత్సాహం తగ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. దుర్గారాధన చేస్తే మంచిది.

సింహం: మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనిప్రదేశంలో ఇతర మార్గల నుంచి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇది మీ నిధిని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. శివారాధన మేలు చేస్తుంది.

కన్య: ధనలాభం ఉంది. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలున్నాయి. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.గతంలో చేసిన నిర్లక్ష్యం మీకు హాని కలిగిస్తుంది. పదే పదే ప్రయత్నించిన తర్వాత కూడా ఫలితం రాకపోవడం మిమ్మల్ని కుంగదీస్తుంది. మీరు మానసికంగా బాధపడాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి.

తులా: మిశ్రమ కాలం. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనుల్లో విజయం కోసం గోవింద నామాలు చదివితే మంచి జరుగుతుంది. వ్యాపారంలో ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. సోదరులు, పొరుగువారితో మంచి సంబంధాలు కొనసాగిస్తారు.

వృశ్చికం: మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

ధనుస్సు: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధనా శుభప్రదం. ఉద్యోగం లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలు తీసుకురాగలిగితే భవిష్యత్తులో లాభం పొందుతారు.

మకరం:శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. సాయి బాబా చరిత్ర చదవడం మంచిది. ఈ రోజు మీరు మీ పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా ఉండాలి. లేకుంటే పరువు నష్టం జరిగే అవకాశముంది. రోజువారీ వ్యాపారంలో ఆందోళనలు పెరుగుతాయి.

కుంభం:ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది.

మీనం: ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి పరిస్థితిలు సృష్టించుకుంటారు. నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. ఇంటి కష్టాలను సహనంతో, మృదువైన ప్రవర్తన ద్వారా ఎదుర్కొంటారు. ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది.

- గుళ్లపల్లి శ్రీకాంత్ శర్మ

9381881581

Show Full Article
Print Article
Next Story
More Stories