Daily Horoscope: ఈరోజు మీరోజు! ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి
Daily Horoscope: వివిధ రాశుల వారి దినఫలాలు
Daily Horoscope: శ్రీ ప్లవ నామ సంవత్సరం| చైత్ర మాసం వసంత బుతువు| ఉత్తరాయణం సోమవారం| సూర్యోదయం: 5.35 | సూర్యాస్తమయం సా.6.18| తిథి చతుర్థశి రా.గం.9.19వరకు | తదుపరి అమావాస్య |నక్షత్రం అశ్వనీ రా.గం.08.09 వరకు| తదుపరి భరణి| రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు| యమగండం ఉ.10.30 నుంచి 12.10 వరకు| వర్జ్యం సా.3.46 నుంచి 5.31 వరకు| దుర్ముహూర్తం ప. 12.22 నుంచి 1:18 వరకు పున్నః మ.02:55 నుంచి 03.46 వరకు| అమృతఘడియలు ప.12.16నుంచి 2.10 వరకు
మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: అనుకున్న పనులు మొదట్లో నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు.
మిథునం: కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత పెరుగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం: సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక సంఘటన మలుపు తిప్పుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది.
సింహం: కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి సా«ధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. యుక్తి, మేథస్సుతో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. పాత అనుభవాల రీత్యా నిర్ణయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.
తుల: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధువర్గం మీపై ఒత్తిడులు పెంచుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యంతో ఫలితాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిం^è ండి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు.
వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు.
ధనుస్సు: ప్రముఖులు సహాయసహకారాలు అందిస్తారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. వ్యాపారాల విస్తరణలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం: సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు, కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకుంటారు. «ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.
కుంభం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆస్తుల విషయంలో జ్ఞాతులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం: పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఉద్యోగార్థుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire