శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది.. నిబంధనలివే!

శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది.. నిబంధనలివే!
x
Highlights

లాక్ డౌన్ సడలింపులతో రెండున్నర నెలల విరామం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది. జూన్ 8 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ముందుగా టీటీడీ...

లాక్ డౌన్ సడలింపులతో రెండున్నర నెలల విరామం తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకోనుంది. జూన్ 8 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. ముందుగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంత మంది భక్తులకు అనుమతించాలనే విషయంపై ఆలోచన చేస్తారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తులకు శ్రీవారి దర్శనం ఎలా కల్పించనున్నారు అనేదానిపై హెచ్ ఎంటీ గ్రౌండ్ రిపోర్ట్.

తిరుమల శ్రీవారిని భక్తులు దర్శనం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 8 నుంచి స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కల్పిస్తారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ముందుగా టీటీడీ ఉద్యోగులు, స్థానికులకు వెంకన్న దర్శనం కల్పిస్తూ ట్రయల్ రన్ నిర్వహించనుంది.

తిరుమల లో వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టారు. క్యూ లైన్లు, ఆలయంలోపల భక్తుల ఆరు అడుగుల దూరం పాటించేలా లైన్లు డబ్బాలు గీశారు. ఆ లైన్లు, డబ్బాలలో భక్తులు నిలబడి ఒకరి తర్వాత ఒకరు ముందుకు వెళ్లాలి. అలాగే ముఖాలకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నభక్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఆన్ లైన్ బుకింగ్ కోసం అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే భక్తులను ఆలయం లోపలికి పంపిస్తారు. పుష్కరిణిలో స్నానాలు నిషేధం విధించారు. టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు.

టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ సక్సెస్ అయితే, మిగతా ప్రాంతాల భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. అయితే, లాక్ డౌన్ ముందు మాదిరిగా రోజూ వేలాది మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం దొరకదు కరోనా కట్టడిలో భాగంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు. రోజూ ఐదారు వేల మందికే స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు అని తెలుస్తోంది.

ప్రతి భక్తుడి మద్య భౌతిక దూరం పెట్టడంతో గంటకు 300 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. స్వామివారికి జరిగే కైంకర్య సేవలు, నైవేద్య విరామలు, ఏకాంత సేవలు పోను రోజుకు 5 లేక 6 వేల మందికి దర్శన భాగ్యం కలుగుతుంది. విఐపి సేవలు ఉంటాయా?

ఉంటే ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు, ఎలాంటి ప్రాతిపదిన ఎంపిక చేస్తారు అనేది ఇంకా నిర్ణయించలేదు. సిఫారసు లేఖలపై కూడా స్పష్టత రాలేదు.

తిరుమల కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు భక్తులు మాత్రమే బస చేసేందుకు అనుమతిస్తారు. కొద్దిరోజుల పాటు ఒకదాన్ని వదిలి మరో కోటి చొప్పున 50 శాతం గదులు మాత్రమే కేటాయిస్తారు. తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు శానిటైజేషన్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోనేలా చర్యలు తీసుకుంటున్నారు.

లాక్ డౌన్ విధించిన రెండున్నర నెలల తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశానికి అనుమతి ఇవ్వడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేవదేవుడ్ని ఎప్పుడెప్పుడూ చూసి తరిస్తామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

లాక్ డౌన్ సడలింపులతో రెండున్నర నెలల తర్వాత తిరుమల ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని అనుమతి ఇస్తున్నారు. మొదట్లో మాదిరిగా ఏడుకొండలపై పరిస్థితులు ఉండవు. కరోనా వ్యాధి నిరోధక పకడ్బందీగా చేపడుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులకు తిరుమలలోకి అనుమతి ఇవ్వరు. స్వామివారి దర్శనంపై నియంత్రణ పెడతారు. ఎలాగైతేనేం శ్రీవారి దర్శన భాగ్యం తిరిగి లభించడంపై భక్తజనంలో ఆనందం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories