Calender Vastu: మీకు తెలుసా క్యాలెండర్‌ శుభ, అశుభాలను కలిగిస్తుందని..!

Calendar Has Auspicious And Inauspicious Effects As Per Vastu Choose Each Correctly For Positive Energy
x

Calender Vastu: మీకు తెలుసా క్యాలెండర్‌ శుభ, అశుభాలను కలిగిస్తుందని..!

Highlights

Calender Vastu: వాస్తు శాస్త్రం ఒక ప్రాచీన భారతీయ శాస్త్రం. ఇది మన ఇల్లు, ఆఫీసులో ఏది ఎక్కడ ఉండాలో నిర్ణయించే సూచనలను అందిస్తుంది.

Calender Vastu: వాస్తు శాస్త్రం ఒక ప్రాచీన భారతీయ శాస్త్రం. ఇది మన ఇల్లు, ఆఫీసులో ఏది ఎక్కడ ఉండాలో నిర్ణయించే సూచనలను అందిస్తుంది. వాస్తులో సమయం, దిశ చాలా ముఖ్యమైనవి. క్యాలెండర్‌ కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది శుభ సమయం ఎంచుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాలెండర్ పాజిటివ్‌ శక్తి, ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే ఇంట్లో సరైన దిశలో, సరైన స్థలంలో ఉండాలి.

పాజిటివ్‌ ఎనర్జీ కోసం

ఇంట్లో సంతోషం వెళ్లివిరియాలంటే క్యాలెండర్‌ ఉండే దిశ సరైన విధంగా ఉండాలి. సహజ దృశ్యాలతో కూడిన క్యాలెండర్లు, పువ్వుల చిత్రాలు లేదా గొప్ప వ్యక్తుల చిత్రాలు వంటివి పాజిటివ్‌ శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

పాత క్యాలెండర్

క్యాలెండర్ చిరిగినా లేదా పాతది అయినట్లయితే వెంటనే దానిని తొలిగించాలి. క్యాలెండర్ పేజీని ప్రతి నెలాఖరులో మార్చాలి. ఇది సమయానికి అనుగుణంగా ఉండటానికి తోడ్పడుతుంది.

క్యాలెండర్‌కు దిశ

ఇంటికి తూర్పు, ఉత్తర దిశలో ఉంచిన క్యాలెండర్ పాజిటివ్‌ శక్తిని తెస్తుంది. వాస్తు ప్రకారం క్యాలెండర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి తూర్పు, ఉత్తర దిశలు ఉత్తమమైనవి అని చెప్పారు.

నెగిటివ్‌ ఎనర్జీ ప్రసారం చేసే క్యాలెండర్లు

యుద్ధం, విచారకరమైన ముఖాలు, ఎండిన అడవులు, ప్రకృతి విధ్వంసం మొదలైన చిత్రాలు ఉండే క్యాలెండర్లు ఉపయోగించకూడదు. అంతేకాకుండా క్యాలెండర్లను ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు. ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్‌ ఎనర్జీని సృష్టిస్తాయి.

వయస్సు, పరిస్థితుల ప్రకారం క్యాలెండర్లు

వివిధ వయస్సుల వ్యక్తుల కోసం వివిధ రకాల క్యాలెండర్లు ఉంటాయి. ఉదాహరణకు కొత్తగా పెళ్లయిన జంటల కోసం శృంగార సన్నివేశాలు, వృద్ధులకు ఆధ్యాత్మిక దృశ్యాలు, పిల్లల జ్ఞానం కోసం ఎదుగుదలని వర్ణించే చిత్రాలతో కూడిన క్యాలెండర్‌లను కలిగి ఉండటం ఉత్తమం.

దేవతామూర్తుల చిత్రపటం

క్యాలెండర్లపై దేవతామూర్తుల చిత్రపటాలు ఉంటే అది పాతబడిన తర్వాత ప్రవహించే నీటిలో గౌరవప్రదంగా నిమజ్జనం చేయాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories