Buying Silver: ఈ దీపావళికి వెండి కొంటున్నారా.. ఇవి గమనించకుంటే మోసపోతారు..!

Buying Silver This Diwali Recognize Real Silver And Fake Silver
x

Buying Silver: ఈ దీపావళికి వెండి కొంటున్నారా.. ఇవి గమనించకుంటే మోసపోతారు..!

Highlights

Buying Silver: దీపావళి సందర్భంగా ప్రజలు బంగారం, వెండిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Buying Silver: దీపావళి సందర్భంగా ప్రజలు బంగారం, వెండిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే చాలామంది అసలు, నకిలీ వెండిని గుర్తించలేరు. పండుగ సందర్భంగా వ్యాపారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. నకిలీ వెండిని గుర్తించడానికి చాలా పద్దతులు ఉన్నాయి. వీటిని ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు. నిజమైన, నకిలీ వెండిని సులభంగా గుర్తించవచ్చు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

స్టాంపు

వెండిపై అనేక రకాల స్టాంపులు ఉంటాయి. వెండి నిజమైనదా కాదా అని చెక్‌ చేయడానికి, ఖచ్చితంగా ఈ స్టాంపులను పరిగణలోనికి తీసుకోవాలి. దీని కోసం భూతద్దాన్ని ఉపయోగించాలి. వెండి పైన 920 స్టాంప్‌ని చూస్తే 92.5% వెండి, 900 స్టాంపు చూస్తే 90% వెండి, 800 అంటే 80% వెండి అని అర్థం.

అయస్కాంతం

వెండి నిజమైనదా లేదా నకిలీదా అని నిర్ధారించడానికి అయస్కాంతాలను ఉపయోగించవచ్చు. దీని కోసం వెండి దగ్గర అయస్కాంతం పెట్టినప్పుడు అవి ఒకదానికొకటి అంటుకుంటే అది నిజమైన వెండి కాదని అర్థం.

మంచు గడ్డ

నిజమైన లేదా నకిలీ వెండి మంచు ముక్క ద్వారా నిర్ణయించవచ్చు. ఇందుకోసం వెండిపై మంచు ముక్కను పెట్టాలి. వెండిపై పూత కరిగితే అది నిజమైన వెండి కాదని అర్థం చేసుకోవాలి.

బ్లీచ్

బ్లీచ్ ఉపయోగించి వెండి నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. ఇందుకోసం వెండిపై ఒక చుక్క బ్లీచ్ వేయండి. అది వెంటనే నల్లగా మారితే అది నిజమైన వెండి అని అర్థం చేసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories