History Of Ayodhya Ram Mandir: ఆరాధ్య రాముని కోసం అనంత దేవతలు నిర్మించిన అయోధ్యాపురి!

History Of Ayodhya Ram Mandir: ఆరాధ్య రాముని కోసం అనంత దేవతలు నిర్మించిన అయోధ్యాపురి!
x
Ram Mandir
Highlights

Ayodhya Ram Mandir Bhumi Pujan : హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి రామజన్మ భూమి రాముడిదే అంటూ...

Ayodhya Ram Mandir Bhumi Pujan : హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాలనాటి వివాదానికి తెరదించి రామజన్మ భూమి రాముడిదే అంటూ తేలిన సందర్బంగా అక్కడ మందిరం నిర్మాణం పనుల్లో వేగం పుంజుకుంటున్నాయి. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆగష్టు 5న అంటే ఈ రోజున పుణ్య ఘడియల్లో ఆలయ పునాదులకు శ్రీకారం చుడుతున్నారు. అసలు ఈ ఆయోధ్య పట్టణం ఎక్కడ ఉంది.. దాని చరిత్ర ఏంటి...అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం తెసుకుందాం..

అయోధ్య భారతదేశంలోని అతిపురాతన నగరాలలో ఒకటి. అయోధ్య నగరం చారిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. శ్రీరాముడు ఈ అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఆ అయోధ్య పురి. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. రామాయణ మహాకావ్య ఆ విష్కరణకు మూలమే ఆ అయోధ్య నగరం. అయోద్య నగరం ఉత్తరప్రదేశ్ లోని ఒక ముఖ్యపట్టణం. ఇది ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా ఫైజాబాదుని ఆనుకుని, సముద్రమట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పటి కాలంలో అయోధ్య నగరం కోసలరాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము.

రామాయణాన్ని అనుసరించి చూస్తే ఈ నగరం 9,000 సంవత్సరాలకు పూర్వం, వేదాలలో మొదటి పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్టుగా పేర్కొన్న మనువు చేత స్థాపించబడింది. మరికొన్ని ఆధారాలనుబట్టి ఈ నగరం సూర్యవంశరాజైన ఆయుధ్ ద్వారా నిర్మించబడిందని తెలియజేస్తున్నాయి. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోశలదేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన రామచంద్రుడు పాలించాడు.

స్కంద పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షపురాణాలలో అయోధ్య ఒకటి అని చెప్తున్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో ఈ పురాణాలు అతి ముఖ్యమైనవి. అధర్వణ వేదం అయోధ్య దేవనిర్మితమని అది స్వర్గసమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశం వాడైన పృధువు వలన భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని పురాణాలు చెపుతున్నాయి. అనంతరం రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చరంద్రుడు ఈ రాజ్యాన్ని పాలించారు. హరిశ్చంద్రుడు సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన వాడు. ఆయన వంశం రాజుల గొప్పతనానికి తన సత్యవాక్పరిపాలనతో ఘనతను తీసుకు వచ్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించాడు. ఆ యాగంతో విఘ్నం వైదొలగించి ఆయన ముని మనుమడైన భగీరధుడు గంగానదిని విశేషప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. అనంతరం వచ్చిన రఘుమహారాజు రాజ్యావిస్తరణ చేసి పేరుగడించి సూర్యంశంలో మరో వంశకర్త అయ్యాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా కూడా పిలువబడింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడు రామచంద్రుడు.

ఆయోధ్య చరిత్ర

అతిపురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం పతితపావని అయిన గంగానదీ తీరంలో ఉంది. అలాగే సరయూనది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగరవైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసలరాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది.

వాల్మికి రచించిన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసీ దాసు తిరిగి రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళకవి కంబర్ వ్రాసిన కంబరామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.

జైన్ మతస్థులకు కూడా ప్రముఖ్యమైన నగరం ఈ అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులిద్దరికి అయోధ్య జన్మస్థలం అయింది. అంతే కాదు మరో ఐదుగురు తీర్థంకరులకు కూడా జన్మస్థలంగా ఈ నగరం ఉంది. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు రాయబడింది.

అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం. అందువలన ఇక్కడ మౌర్యాచక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారకనిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీ.పూ 600 లలో కూడా అయోధ్య వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్దం నుండి క్రీ.శ 5వ శతాబధం వరకు బౌద్ధమతకేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈనగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు.

అయోధ్య అనే పేరు ఎందుకొచ్చింది..

మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడుగా పేర్కొనబడింది. అతడి పేరు సంకృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయొధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాలిలో అయోజిహా అని పిలువబడింది అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలు గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది.

కామన్ ఎరా మొదటి శతాబ్ధాలలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది. క్రీ.శ 127 సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పుప్రాంతంనికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హూయంత్సాంగ్ క్రీ.శ 636 లో తన భారతదేశ యాత్రలో ఈనగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. కాని ఈ పేరు మార్పు ఎప్పుడు జరిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనాసమయంలో ఈనగరం అయోధ్య, అజోధియ అని పిలువబడింది. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది.

చూడవలసిన ప్రదేశాలు...

అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలంటే రిక్షాలు మాట్లాడుకుని వాటిలో వెళ్ళి చూడాలి. రిక్షా నడిపేవారు ఇక్కడ ముఖ్యమైన ఆలయాలు, మందిరాలను ఒక్కొక్కటిగా చూపుతారు. రామజన్మభూమిని కూడా అలాగే చూడాలి.

సరయూనది స్నానఘట్టం. ఇక్కడ సరయూ నదిలో తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. సరయూ నదీజలాలు తేటగానూ శుభ్రంగానూ ఉంటాయి.

రామజన్మభూమి ఆలయనిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిసాక ఆలయనిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి.

అయోధ్యలో భిక్షువులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతలసహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200 కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమనిర్వహణకు ఉపయోగించబడతాయి.

కౌసల్యాదేవి మందిరం. శ్రీమునికి జన్మనిచ్చిన కౌశల్యాదేవికి ఇక్కడమాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. ఈ మందిరంలో కౌశల్యాదేవి, దశరథులతో రామచంద్రుడు ఉండడం విశేషం.

హనుమద్ మందిరం. ఇక్కడ ఉన్న హనుమదాలయంలో నిరంతరం అఖండ భజన కొనసాగుతూ ఉంటుంది.

వాల్మికీ మందిరం. వాల్మికీ మందిరంలోని పాలరాతి గోడల మీద వాల్మికీ రామాయణంలోని 24 వేల శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. ఇక్కడ మూల మందిరంలో వాల్మికి మహర్షితో లవకుశులు ఉండడం విశేషం.

కనక మహల్. సితారాములు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైకేయీ, దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనం ఇవ్వబడిందని విశ్వసించబడింది. ప్రస్తుతభవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని విశ్వసించబడుతుంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానం ఆచరించి అయోధ్యా నగరంలో ప్రవేశించిన తరువాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్లకు కట్టినట్లు గోచరమైయ్యాయని తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు, భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించబడుతుంది.

హనుమదాలయం. రామచంద్ర పట్టాభిషేకం తరువాత రామచంద్రుడు తనకు సాయం చేసిన వారందరికి కానుకలు సార్పించిన తరువాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని అక్కడ ప్రస్తుతం ఆలయనిర్మాణం జరిగిందని విశ్వసించబడుతుంది. పురాణ ప్రసిద్ఫ్హమైన ఈ ఆలయం కొంచం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సితారాముల ఆలయం ఉంది.

రామజన్మ భూమి. బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మ భూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సితారాములకు పూజాధికాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత

రక్షణ వలయంలో క్యూపద్ధతిలో ప్రయాణించి ఊ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అలాపోతూ పోతూనే ఆలయాన్ని దర్శించాలి. ఎక్కడా నిలవడానికి రక్షణసిబ్బంద్జి అనుమతించదు. సెల్ పోన్, కెమెరాలు, పెన్నుల వంటివి కూడా లోపలకు అనుమతించరు. లోపల కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవాలి కనుక చెప్పులు వేసుకుని లోపలకు వెల్లాలి.

అయోధ్య వివాదం..

మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992 వ సంవత్సరంలో రామ భక్తులు, దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పి.వి. నరసింహారావు. దీన్ని నివారించలేక పోయిన ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చ లా మిగిలిపోయింది. 09-11-2019 న అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. '2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్‌కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్‌కి అప్పగించండి.




Show Full Article
Print Article
Next Story
More Stories