Vastu Tips: ఇంట్లో ఈ మూలన ఒక జత చేపలను ఉంచండి.. తర్వాత మార్పులు గమనించండి..!

According To Vastu Keep A Pair Of Fish In This Corner Of The House Happiness And Joy Will Be Obtained
x

Vastu Tips: ఇంట్లో ఈ మూలన ఒక జత చేపలను ఉంచండి.. తర్వాత మార్పులు గమనించండి..!

Highlights

Vastu Tips: ఫెంగ్ షుయ్ అనేది ఇంట్లో లేదా కార్యాలయంలో పాజిటివ్​ శక్తిని ప్రోత్సహించే ఒక ప్రాచీన శాస్త్రం. జీవితంలో పాజిటివ్​ మార్పులను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది.

Vastu Tips: ఫెంగ్ షుయ్ అనేది ఇంట్లో లేదా కార్యాలయంలో పాజిటివ్​ శక్తిని ప్రోత్సహించే ఒక ప్రాచీన శాస్త్రం. జీవితంలో పాజిటివ్​ మార్పులను తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఇంట్లో ఆనందం, శాంతిని ప్రోత్సహిస్తుంది. ఫెంగ్ షుయ్‌ని అనుసరించడం వల్ల జీవితంలో సమతుల్యత, పాజిటివ్​ ఎనర్జీ లభిస్తుంది. నెగిటివ్​ ఎనర్జీ తొలగిపోతుంది. ఇందులో భాగంగా ఒక జత చేపల చిహ్నం ఇంటి మూలలో పెట్టాలని సూచించింది. భారతీయ జ్యోతిషశాస్త్రం ప్రకారం చేపలను శుభప్రదంగా, సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇది విష్ణువు మత్స్య అవతారానికి సంబంధించినది.

జత చేపలు

ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఒక జత చేపల చిహ్నాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడు ఆనందం వెళ్లివిరుస్తుంది. ఆఫీసులో వేలాడదీయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. నీటిలో నివసించే చేపలు సంపద, లార్డ్ విష్ణువుతో సంబంధం కలిగి ఉంటాయి. దీని చిహ్నాన్ని ఇంట్లో వేలాడదీయడం వల్ల పాజిటివ్​ ఎనర్జీతో పాటు సంపద పెరుగుతుంది.

లోహంతో చేసిన చేపలు

అక్వేరియంలో చేపలను ఉంచలేని వారు లోహంతో చేసిన చేపల చిహ్నాన్ని ఇంట్లో వేలాడదీయవచ్చు దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ ఒత్తిడి తగ్గుతుంది. చేపలు నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటాయి. నీరు మనకు శాంతి సామరస్యాన్ని అందిస్తుంది.

ఈశాన్య మూలలో వేలాడదీయాలి

ఒక జత చేపల బొమ్మలను ఇంట్లో లేదా కార్యాలయంలో ఈశాన్య దిశలో వేలాడదీయాలి. దీనివల్ల పాజిటివ్​ మార్పులు సంభవిస్తాయి. ఇంటి సభ్యులు విపత్తులకు దూరంగా ఉంటారు. వాస్తు ప్రకారం ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లో మంచి వాతావరణం కోసం ఈ చేపల చిహ్నాలు, బొమ్మలు బాగా ప్రభావం చూపిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories