Puja Room Vastu: ఇంట్లో పూజ గది కోసం ఈ నియమాలు పాటించండి.. లేదంటే ఇబ్బందిపడుతారు..!

According To Vastu Follow These Rules For Puja Room At Home Otherwise You Will Be In Trouble
x

Puja Room Vastu: ఇంట్లో పూజ గది కోసం ఈ నియమాలు పాటించండి.. లేదంటే ఇబ్బందిపడుతారు..!

Highlights

Puja Room Vastu: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో పూజగది ఉంటుంది. కుటుంబ సభ్యులు దీనిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడి నుంచి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని నమ్మకం.

Puja Room Vastu: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో పూజగది ఉంటుంది. కుటుంబ సభ్యులు దీనిని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడి నుంచి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని నమ్మకం. ఇది ఇంటి సభ్యులకు సంక్షేమాన్ని తెస్తుంది. ఆలయానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలు వాస్తు శాస్త్రంలో చెప్పారు. వీటిని పాటించకపోతే ఇంట్లోకి నెగిటివ్‌ ఎనర్జీ వస్తుంది. కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఎలాంటి నియమాలు పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నిర్మించాలి. ఈ దిశలలో ఆలయాలను నిర్మించడం శుభప్రదంగా చెబుతారు. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయం దిశను కచ్చితంగా పాటించాలి. మరుగుదొడ్డి ముందు, మెట్ల కింద లేదా మెయిన్‌ గేట్ ముందు ఎప్పుడూ ఆలయాన్ని నిర్మించవద్దు. ఇది అశుభమైనదిగా భావిస్తారు. ఇది కుటుంబ సభ్యులకు హాని కలిగిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి. తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. ఇంటి అధిపతి పురోభివృద్ధిని పొందుతారని నమ్మకం. పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు ఎప్పుడూ దక్షిణం వైపు చూడకూడదని గుర్తుంచుకోండి.

వాస్తు శాస్త్రం ప్రకారం గుడిలో దేవతామూర్తుల విగ్రహాలను ఉంచేటప్పుడు విగ్రహం పెద్దగా ఉండకూడదు. ఆలయంలో 7 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. ఇది కాకుండా ఆలయంలో విరిగిన విగ్రహాన్ని ఉంచడం అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయంలో మతపరమైన గ్రంథాలను ఉంచాలి. అక్కడే వాటిని చదవాలి. ఇది పాజిటివ్‌ ఎనర్జీని పెంచుతుంది.

ఈ విషయాలు గుర్తుంచుకోండి

గుడిలో పూజ చేసేటప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగించకూడదు. దక్షిణ దిశను యమ దిక్కుగా పరిగణిస్తారు. ప్రతిరోజూ ఆలయాన్ని శుభ్రం చేయాలి. దాని స్వచ్ఛతను కాపాడాలి. రోజూ అగరబత్తీలు వెలిగించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories