Vastu Tips: మంచం కింది బాక్స్‌లో ఇలాంటి వస్తువులు పెట్టవద్దు.. ఆర్థికంగా నష్టపోతారు..!

According To Vastu Do Not Put These Things In The Box Under The Bed You Will Lose Financially
x

Vastu Tips: మంచం కింది బాక్స్‌లో ఇలాంటి వస్తువులు పెట్టవద్దు.. ఆర్థికంగా నష్టపోతారు..!

Highlights

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనివల్ల అప్పుల బారిన పడుతారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దీనివల్ల అప్పుల బారిన పడుతారు. వాస్తవానికి పట్టణాలు, నగరాల్లో ఇళ్లు చిన్నవిగా ఉండటం వల్ల ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వస్తువులని పెట్టేస్తారు. కానీ ఇది మంచి పద్దతి కాదు ప్రతి దానికి ఒక పద్దతి ఉంటుంది. దాని ప్రకారం నడుచుకోవాలి. అలాగే బెడ్‌ కింద ఉండే బాక్సులో చాలామంది రకరకాల వస్తువులని దాచిపెడుతారు. ఇది కూడా ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు ఇందులో పెట్టకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

బంగారం, వెండి ఆభరణాలు

చాలా మంది బంగారం, వెండి ఆభరణాలను బెడ్‌ కింది బాక్సులో పెడుతారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. బంగారం విష్ణువుకు సంబంధించినది వెండి అభివృద్ధికి సంబంధించినది. ఈ వస్తువులను బెడ్‌ కింది బాక్సులో ఉంచడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఇది మిమ్మల్ని ఆర్థిక సంక్షోభానికి గురి చేస్తుంది.

పాదరక్షలు

వాస్తు శాస్త్రంలో పడకగదిలో బూట్లు, చెప్పులు ఉంచకూడదు. బెడ్ రూమ్‌లో వాడే స్లిప్పర్లను కూడా బెడ్‌కు దూరంగా ఉంచాలి. బెడ్‌ కింది బాక్సులో కొత్తవైనా, పాతవైనా బూట్లు, చెప్పులు ఉంచకూడదు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే నెగటివ్‌ ఎనర్జీ మీ నిద్రకు భంగం కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.

పాత్రలు

బెడ్‌ కింది బాక్సులో మట్టిపాత్రలు ఉంచడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది. ఇక స్టీల్ పాత్రలు శనికి సంబంధించినవి. ప్లాస్టిక్ లేదా సిరామిక్-గ్లాస్ టపాకాయలు రాహువుకు సంబంధించినవి. ఇలాంటి వస్తువులని బెడ్‌ కింది బాక్సులో ఉంచడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు ఆర్థిక నష్టానికి కారణమవుతాయి.

డబ్బు

చాలామంది భద్రత కోసం మంచం కింది బాక్సులో డబ్బులు దాస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. దీనివల్ల అప్పుల భారిన పడుతారు. నిజానికి దుస్తులు, దుప్పట్లు వంటివి వేస్తే పర్వాలేదు కానీ వాస్తు దోషాలు కలిగించే ఇలాంటి వాటిని ఎప్పుడు పెట్టకూడదని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories