చిరుధాన్యాల వంటకాలపై యువత ఆసక్తి

చిరుధాన్యాల వంటకాలపై యువత ఆసక్తి
x
Highlights

ఒకప్పడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరు ధాన్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఆహారం అయ్యాయి. ఫాస్ట్ ఫుడ్ కు అలవాటైన నేటి యువత చిరుధాన్యాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఒకప్పడు నిరుపేదల ఆకలి తీర్చిన చిరు ధాన్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో ఆహారం అయ్యాయి. ఫాస్ట్ ఫుడ్ కు అలవాటైన నేటి యువత చిరుధాన్యాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన ఎందరో ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు పాటిస్తున్నారు. పూర్వీకులు ఆహారంగా తీసుకున్న చిరుధాన్యాల వంటకాలు తినేందుకు పోటీ పడుతున్నారు. భాగ్యనగరంలో చిరుధాన్యాల వంటకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

కలో గంజో తాగి బతకడం పాత సామెత.. కలో గంజో తాగితేనే బతకగలగడం నేటి సామెతగా మారింది. నిన్నటి దాకా పేదల తిండి ఇప్పుడు పెద్దల జీవనాధారం అయింది..జొన్న గడ్క, రాగి అంబలి, కొర్ర బువ్వ.. ఇవన్నీ పేద వాడి ఆకలి తీర్చేవే కాదు.. అందరి ఆరోగ్యాలు బాగు చేస్తున్నాయి. ఇప్పుడీ వంటలు పాక హోటెల్లో దొరక్కపోవచ్చు..కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు.. స్టార్ హోటల్స్ లోనూ మిల్లెట్ ఫుడ్ మెయిన్ మెనూలో చేరింది.

ఫాస్ట్ ఫుడ్ యుగంలోనూ యువత చిరు ధాన్యాల వంటకాలపై ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆరు పదుల వయస్సు నిండిన వారు బీపీ., షుగర్ వంటి వ్యాధుల భారీన పడేవారు..కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. పాతికేళ్లకే బీపీ, ముప్పై ఏళ్లకే గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. వీటి నుంచి బయట పడేందుకు నాటి తరం ఆహారం అలవాట్లు చేసుకుంటున్నారు నేటి యువత. సిరిధాన్యాలు తిన్న వెనుకటి తరం వారు నేటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉత్సాహంగా ఉండటంతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ చిరుధాన్యాలతో వండిన వంటకాలు తినేందుకు ఇష్టపడుతున్నారు.

ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ మంది ఫిజ్జా., బర్గ్లు, కమెకల్ మిగ్స్ చేసిన ఫ్రై ఐటమ్స్ వదిలేస్తున్నారు. పాత ఆహార పదార్ధాలైన సిరిదాన్యాలు తీసుకుంటున్నారు.యువత ఇష్టపడుతున్న విధంగా భాగ్యనగరం హోటళ్లలో చిరుధాన్యాల వంటకాలు మొదలు పెట్టాయి. రాగులు, జొన్నలు, కొర్రల, సామలు, అరికలతో వండిన వంటకాలు చేస్తున్నారు. హోటల్స్ కు వచ్చే కస్టమర్ల ముందు సిరి ధాన్యాల వంటకాల మెనూ ఉంచుతున్నారు. దీంతో మిల్లట్ ఫుడ్స్ కు మంచి గిరాకి ఏర్పడింది.

మార్కెట్లో లభిస్తున్న ఆహారంలో కార్పో హైడ్రేట్స్, ప్రోటిన్స్, కొవ్వు, మినరల్, మైక్ర్రో న్యూట్రీషన్స్ లేదని గ్రహించిన ఎందరో మిల్లట్ ఫుడ్ తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. సిరి ధాన్యాలు తీసుకోవడంతో పోషక విలువలు అధికమవుతున్నాయని యువకులు చెబుతున్నారు. సిరి ధాన్యాలలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల చిన్న పిల్లల ఎదుగుదలకు, వృద్ధులలో, మహిళల్లో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి తోడ్పడుతున్నాయంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories