Viral Video: ఫ్రెండ్ పెళ్లిలో సరదాగా, అంతలోనే అనంత లోకాలకు.. షాకింగ్ వీడియో
Viral Video: గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Viral Video: గుండె సంబంధిత సమస్యల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత గుండె సంబంధిత సమస్యలు మరింత ఎక్కువుతున్నాయి. అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.
స్మార్ట్ ఫోన్‌లు, సీసీ టీవీ కెమెరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోని కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆందోళన కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. వంశీ అనే యువకుడు స్నేహితుడి వివాహా వేడుకకు తోటి స్నేహితులతో కలిసి హాజరయ్యారు. నవవధువరులకు వారంతా గిఫ్ట్ ఇచ్చారు. ఆ సమయంలో అంతా సంతోషంగా ఉన్నారు. అంతలోనే వంశీకి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీన్ని గమనించిన స్నేహితులు వంశీని పక్కకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే వంశీ కుప్పకూలిపోయాడు.
ఫ్రెండ్స్ హుటాహుటినా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వంశీ చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. కాగా.. వంశీ అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో విధులు నిర్వహిస్తున్న వంశీ.. స్నేహితుడి పెళ్లికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాధం నెలకొంది.
💔 Tragedy Strikes at Wedding:
— amaravatinews24 (@amaravatinews24) November 21, 2024
An Amazon employee dies on stage of a heart attack during his friend's wedding in #AndhraPradesh .
Doctors emphasize rising cardiac risks among youth due to stress, pollution & lifestyle changes.#AmazonEmployee #Kurnool #heartattack #Amaravati pic.twitter.com/X9ldLtMkI6
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire