వరల్డ్ ఫోటో గ్రాఫీ డే: మొదటి ఫోటోలు మీకోసం

వరల్డ్ ఫోటో గ్రాఫీ డే: మొదటి ఫోటోలు మీకోసం
x
Highlights

ఫోటో అంటే ఇష్టం ఉండనిది ఎవరికీ? ఫోటో దిగడం మీద ఎంత సరదా ఉంటుందో.. తీయడానికీ అంతే ఉత్సాహం ఉంటుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ప్రత్యెక ఫోటో కథనం.

రోడ్డు మీద వెళుతున్నాం పక్కనే ఓ అందమైన పక్షి కనబడింది. వెంటనే.. దానిని మన స్మార్ట్ ఫోన్ లో బంధించేస్తాం. దానిని అందరికీ పంపించి సంబరపడిపోతాం. ఫోటోలో మనం కనబడాలని ఎంత ఉబలాట పడతామో ఫోటో తీయదానికీ అంత ఉత్సాహం చూపిస్తాం. ఓ రెండు దశాబ్దాల వెనక్కి వెళితే, అసలు ఫోటో తీయడం ఓ పెద్ద ఆర్ట్ కిందే లెక్క. ఆ కళను ప్రత్యేకంగా నేర్చుకునేవారు. కెమెరా స్వంతంగా కొనుక్కోవడం అంటే అది ఓ పెద్ద విశేషమే. అంతకు మరో రెండు దశాబ్దాల వెనక్కి వెళితే ఫోటో తీయించుకోవడం కేవలం ధనికులకు మాత్రమే ఉన్న అవకాశం. ఇలా వెనక్కి తరచి చూస్తె ఫోటో గ్రాఫి ప్రస్థానంలో బోలెడు మైలురాళ్ళు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ డే. ఈ సందర్భంగా ప్రపంచంలో తొలిసారిగా తీసిన ఫోటోల గురించిన కొన్ని క్లిక్స్..

ప్రపంచంలో మొదటి ఫోటో..


1826లో ఫ్రాన్స్ లో కెమేరాతో మొదటి ఫోటో తీశారు. జోసెఫ్ నికోఫోర్ నిప్సే అనే ఆయన తన ఇంటి మెట్లమీద ఉన్న గిటికీ నుంచి ఈ ఫోటో తీసాడు. ఒక అడ్డం మీద జూడియా బిటమిన్ (ఒక రకమైన తారులాంటి పదార్ధం) పూసి హేలోగ్రఫీ పద్ధతిలో దీనిని తీశారు.





మొట్టమొదటి కలర్ ఫోటో..

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే లెక్కల మాస్టారు 1861లో మొదటి కలర్ ఫోటో తీసారు.







మొట్టమొదటి డిజిటల్ ఫోటో..


1957లో అంటే కోడాక్ డిజిటల్ కెమెరాని కనుగొనడానికి 20 ఏళ్లకు ముందు రస్సెల్ కిర్ష్ తన కొడుకును డిజిటల్ పద్ధతిలో ఫోటో తీశాడు.





మొదటి మనిషి ఫోటో..



లూయిస్ మొదటి సారి మనిషి ఫోటో తీసాడు. ఒక బౌలేవార్డ్ ఆలయం వద్ద నిలబడి ఉన్న మనిషిని ఫోటో తీసాడు. ఈ ఫోటో తీయడానికి ఏడునిమిషాల సమయం పట్టింది. ఈలోపు ఆ వ్యక్తి అక్కడ నుంచి కడలి వెళ్ళిపోయాడు. దాంతో మనిషిని ఫోటో తీయలేకపోయాం అనుకున్నారు. కానీ, ఆ ఆలయం ముందు ఒక వ్యక్తి షూ పాలిష్ చేయించుకుంటున్న విషయం జాగ్రతగా పరిశీలిస్తే కనిపించింది. అందుకే ఇది మొదటి మనిషిని తీసిన మొదటి ఫోటోగా గుర్తింపు పొందింది.



మొదటి సేల్ఫీ..


ఇప్పుడంటే సేల్ఫీ ఇంత తేలికైపోయింది. అప్పట్లోనే ఒకాయన సెల్ఫి తీసుకున్నాడు. అవును.. రాబర్ట్ కర్నేలియుస్ 1839లోనే అంటే దాదాపు 170 ఏళ్లకు పూర్వమే తన ఫోటోను తానే తీసుకున్నాడు. ఇదే మొదటి సెల్ఫి





మొట్టమొదటి ఏరియల్ ఫోటో


పైనుంచి తీసే ఫోటోలు ఏరియల్ ఫోటోలుగా చెబుతారు. 1860లో మొదటి ఏరియల్ ఫోటో తీశారు. రెండు వేల అడుగుల ఎత్తునుంచి బోస్టన్ టౌన్ ను ఈ ఫోటోలో బంధించారు జేమ్స్ వాలెస్ బ్లాక్





అంతరిక్షం నుంచి భూమిని మొదట తీసిన ఫోటో



అక్టోబర్ 24, 1946 న వి-2 రాకెట్ నుంచి భూమికి 65 మైళ్ళ ఎత్తునుంచి భూమిని ఫోటో తీసింది రాకెట్ కి అమర్చిన కెమెరా. .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories