Marriage Delayed: వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ పరిహారాలు చేస్తే ఫలితాలు..!

Will the Marriage be Delayed do these Remedies According to Hindu Tradition
x

Marriage Delayed: వివాహం ఆలస్యం అవుతుందా.. ఈ పరిహారాలు చేస్తే ఫలితాలు..!

Highlights

Marriage Delayed: జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. దీనికోసం యువతీయువకులు చాలా కలలు కంటారు.

Marriage Delayed: జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. దీనికోసం యువతీయువకులు చాలా కలలు కంటారు. అంగరంగవైభవంగా తన వివాహం జరగాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధం కుదరదు. కొన్నిసార్లు కుదిరినట్లే కుదిరి చెడిపోతుంది. దీనికి కారణం జాతక దోషాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజదోషం ఉండటం వల్ల పెళ్లి సకాలంలో జరగదు. వివాహానికి రకరకాల ఆటంకాలు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భంలో కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిష్టాన దైవం. అలాగే రాహువుకి సుబ్రహ్మణ్యస్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. రాహు కేతు దోష పరిహారానికి సుబ్రహ్మణ్యస్వామి పూజలు చేయాలి. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కుజుడు మనిషికి శక్తిని, ధనాన్ని ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే రాహు కేతు పూజలు చేయాలి.

అలాగే వివాహం ఆలస్యం కావడానికి గురు, శని కూడా కారణమవుతాయి. ఈ గ్రహాలని శాంతింపజేయడానికి వాటి పరిహారాలు చేయాలి. అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవడానికి శివుపార్వతులను పూజించాలి. పార్వతి దేవి ఆరాధన సమయంలో ముత్తైదువులకు పసుపు, కుంకుమ సహా మంగళకరమైన వస్తువులను వాయినంగా సమర్పించాలి. యువకులు గురువారం ఉపవాసం ఉండి విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం హనుమాన్‌ దర్శించుకొని పూజలు చేయాలి. దీనివల్ల కొన్ని రోజుల్లో వివాహం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories