రైలు చివ‌ర‌న X గుర్తు ఎందుకు ఉంటుంది.. ఆలోచించారా..!

Why is There an X Mark at the End of the Train
x

రైలు చివరి భాగంలో X గుర్తు ఉండడానికి గల కారణం (ఫైల్ ఇమేజ్)

Highlights

X Mark: భార‌త‌దేశంలో అతి పెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ రైల్వే. ప్ర‌తి రోజు ఎంతో మందిని గ‌మ్య స్థానాల‌కు చేర్చుతుంది

X Mark: భార‌త‌దేశంలో అతి పెద్ద ర‌వాణా వ్య‌వ‌స్థ రైల్వే. ప్ర‌తి రోజు ఎంతో మందిని గ‌మ్య స్థానాల‌కు చేర్చుతుంది. ర‌వాణా ప‌రంగా, వాణ‌జ్య ప‌రంగా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దేశంలో ఎంతోమంది రైల్వేలో ఉద్యోగం చేస్తూ కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద రైల్వే వ్య‌వ‌స్థ ఏ విధంగా ప‌నిచేస్తుంది.. ప్ర‌యాణికుల కోసం వారు ఏ విధ‌మైన సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తారు త‌దిత‌ర విష‌యాల గురించి తెలుసుకుందాం.

భారతీయ రైల్వే భద్రతకు సంబంధించి ప్రత్యేక సంకేతాలు ఉంటాయి. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్లలో అనేక రకాల సంకేతాలను, గుర్తుల‌ను చూసి ఉంటారు. వీటికి ప్రత్యేక అర్థం ఉంటుంది. అలాగే రైలు చివరి పెట్టెపై X అతి పెద్ద గుర్తును కూడా చూసి ఉంటారు. ఈ గుర్త ఏం తెలియ‌జేస్తుందో తెలుసా ఎప్పుడైనా ఈ X గుర్తు రైలు చివరి పెట్టెపై రాస్తారు. అంటే అది ఆ రైలు చివరి పెట్టె అని అర్థం. ప్యాసింజర్ రైలు చివరి పెట్టెలో ఎక్స్ తో పాటు, LV అనే అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఈ ఎల్‌వి అంటే లాస్ట్ వెహికల్. ఈ రెండు సంకేతాలు ప్రధానంగా రైల్వే అధికారులు, ఉద్యోగులకు సంబంధించినవి.

వాస్త‌వానికి ఈ సంకేతాలకు ప్ర‌యాణికులకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏదైనా రైలుకి చివ‌ర‌న ఈ గుర్తు ఉండ‌కుంటే రైల్వే ఉద్యోగి అప్ర‌మ‌త్తం కావాల్సి ఉంటుంది. వెంటనే సమీప కంట్రోల్ రూమ్‌కు తెలియ‌జేయాలి. లేదంటే అత‌డి ఉద్యోగం పోతుంది. ఈ రెండు సంకేతాలు రైలు చివరి బోగికి కనిపించకపోతే రైలు చివరి కంపార్ట్మెంట్ లేదా వెనుక భాగంలో ఉండో బోగీలు విడిపోయాయ‌ని భావిస్తారు. అందుకే రైల్వే అధికారులు అప్ర‌మ‌త్తం అవుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories