భారీ ఓడలు నీటిలో ఎందుకు మునిగిపోవు... దీనికి కారణాలేంటి?

Why Heavy Ships Do Not Sink In Water Know The Reasons
x

భారీ ఓడలు నీటిలో ఎందుకు మునిగిపోవు... దీనికి కారణాలేంటి?

Highlights

General Knowledge: నీటిలో చిన్న రాయి వేస్తే అది వెంటనే మునిగిపోతుంది

General Knowledge: నీటిలో చిన్న రాయి వేస్తే అది వెంటనే మునిగిపోతుంది. అలాంటిది క్వింటాళ్ల కొద్ది బరువు ఉన్న భారీసైజు ఓడలు నీటిలో ఎందుకు మునిగిపోవు. ఈ అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండరు. మన దేశంలో సరుకు రవాణా ఓడల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనికి కారణం వాయు, రోడ్డు మార్గం కంటే జలరవాణా ఖర్చు తక్కువగా ఉంటుంది. అందుకే వ్యాపారులు ఎక్కువగా ఓడలవైపు మొగ్గు చూపుతారు. ఈ రోజు ఓడ సముద్రాలు, నదుల్లో ఎలా నీటిపై తేలియాడుతుందో తెలుసుకుందాం.

వాస్తవానికి నీటిలో భారీ ఓడ మునిగిపోకుండా ఉండటానికి ఆర్కిమెడిస్ సూత్రం కారణం. దీని ప్రకారం.. ఓడ చాలా బరువుగా ఉండవచ్చు కానీ అది నీటిని స్థానభ్రంశం చేస్తుంది. ఓడ సన్నని నిర్మాణం ఓడలో ఉన్న గాలితో నిండిన కంపార్ట్‌మెంట్లు నీటిలో తేలేందుకు సాయపడుతాయి. ఓడ నీటిలో తేలుతున్నప్పుడు అది దాని బరువుకు సమానమైన నీటిని స్థానభ్రంశం చేస్తుంది. స్థానభ్రంశం చెందిన నీటి బరువు ఓడ బరువును సమతుల్యం చేస్తుంది తద్వారా ఓడ మునిగిపోకుండా నడుస్తుంది. అలాగే ఓడలు నీటిపై తేలేలా ప్రత్యేకంగా రూపొందిస్తారు.

వాస్తవానికి ఓడ నిర్మాణం సన్నగా నీటిలో ముందుకు వెళ్లే విధంగా రూపొందిస్తారు. దీని కారణంగా నీటి నిరోధకత తగ్గుతుంది. అదే సమయంలో ఓడలో గాలితో నిండిన కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవి ఓడ సగటు సాంద్రతను తగ్గిస్తుంది. ఓడ సగటు సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉన్నందున ఓడ నీటిలో తేలుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొన్ని పరిస్థితులలో ఓడ మునిగిపోతుంది. ఓడలో రంధ్రం ఏర్పడి ఓడ లోపలకి నీరు ప్రవేశించవచ్చు ఓడ మునిగిపోతుంది.ఓడ దాని సామర్థ్యం కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటే ఓడ మునిగిపోతుంది. తుఫాను సమయంలో బలమైన గాలులు ఎత్తైన అలలు ఓడను ముంచే అవకాశాలు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories