Silver Anklets: పట్టీల వెనుక ఉన్న ప్రయోజనం ఇదే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Why Do Women Wear Silver Anklets On Their Legs
x

Silver Anklets: పట్టీల వెనుక ఉన్న ప్రయోజనం ఇదే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Silver Anklets: ఇంట్లో ఆడపిల్లలు కాళ్లకి వెండిపట్టీలు కట్టుకొని తిరుగుతుంటే సాక్ష్యత్తూ లక్ష్మీదేవి వచ్చినట్లుగా భావిస్తారు పెద్దలు.

Silver Anklets: ఇంట్లో ఆడపిల్లలు కాళ్లకి వెండిపట్టీలు కట్టుకొని తిరుగుతుంటే సాక్ష్యత్తూ లక్ష్మీదేవి వచ్చినట్లుగా భావిస్తారు పెద్దలు. ఆ గజ్జెల చప్పుడు అంత వినసొంపుగా ఉంటుంది. అయితే చాలామంది మహిళలకు వెండి పట్టీలు ఎందుకు ధరిస్తారో తెలియదు. నిజానికి నేటి కాలంలో వీటిని ఒక స్టేటస్​ సిబంల్​గా భావిస్తున్నారు. కానీ ఈ పట్టీల వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. ఇవి వారి కాళ్లకి అందానివ్వడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పట్టీల వెనుక ఉన్న సీక్రెట్​ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అనారోగ్య సమస్యలకు చెక్​

వెండి పట్టీలను ధరించడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వెండి శరీరానికి తగ్గట్టు ప్రతి స్పందించే ఒక లోపం. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆడవారిలో హార్మోన్ల స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. కేవలం ఆకర్షణ కోసం సంప్రదాయం కోసమే మాత్రమే కాదు స్త్రీలలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు ఈ పట్టీలు చెక్ పెడుతాయి.

పీరియడ్స్ లో ఉపశమనం

పీరియడ్స్​ సమయంలో ఆడవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ నొప్పులన్నింటిని తగ్గించడంలో వెండి బాగా పనిచేస్తుంది. నెలసరి సమయంలో వివిధ రకాల నొప్పులతో బాధ పడే వారు వెండి పట్టీలు, వెండి మెట్టెలు, వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఉపశమనం పొందుతారు.

ఆర్థరైటీస్​కు చెక్

నేటి రోజుల్లో చాలామంది ఆర్థరైటీస్ సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆడవారు వెండి ఉంగరాలు, పట్టీలు, మెట్టెల ధరించడం వల్ల ఆ సమస్యను నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆర్థరైటీస్ వచ్చిన వాళ్లు వెండి వస్తువులను ధరించడం వల్ల దాని లక్షణాలను తగ్గించుకోవచ్చు.

శరీరంపై గాయలు నయం

ప్రాచీన కాలం నుంచి వెండి వస్తువులకు, వెండి ఆభరణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరిస్తే శరీరంపై ఉండే గాయలు తొందరగా మానుతాయట. ఇన్ ఫెక్షన్ లతో పోరాడే శక్తి లభిస్తుంది. అలాగే శరీరంలో బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories