IAS vs IPS: కలెక్టర్‌, ఎస్పీలలో ఎవరు శక్తివంతులు.. జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా..?

Who is Powerful Among the Collector and SP do you Know What the Salaries are Like
x

IAS vs IPS: కలెక్టర్‌, ఎస్పీలలో ఎవరు శక్తివంతులు.. జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా..?

Highlights

IAS vs IPS: కలెక్టర్‌ కావాలన్నా ఎస్పీ కావాలన్నా ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

IAS vs IPS: కలెక్టర్‌ కావాలన్నా ఎస్పీ కావాలన్నా ముందుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. పోస్టులు ఎప్పుడైనా 500 నుంచి 1000 వరకు మాత్రమే ఉంటాయి. ఇందులో మంచి ర్యాంకు వస్తేనే వారు కలెక్టర్‌ లేదా ఎస్పీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు ఉద్యోగాల విధులు వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలామంది ఐఏఎస్‌లకే ప్రాధాన్యత ఇస్తారు. మరికొంతమంది ఐఏఎస్‌ కాదనుకొని ఐపీఎస్‌ అయ్యేవాళ్లు ఉంటారు. ఈ రెండు ఉద్యోగాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పని పూర్తి భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా ఇద్దరికీ వేర్వేరు అధికారాలు ఉంటాయి. ఐఏఎస్‌ అంటే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌. వీరు దేశంలోని బ్యూరోక్రటిక్‌ నిర్మాణంలో పనిచేసే అవకాశం పొందుతారు. ఐఏఎస్‌ అధికారులని ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, పరిపాలనా విభాగాలలో నియమిస్తారు. అదే సమయంలో ఐపీఎస్‌ డైరెక్ట్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉంటుంది. ఐపీఎస్‌ అధికారి కంటే ఐఏఎస్‌ అధికారి జీతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక జిల్లాకి ఒక ఐఏఎస్‌ అధికారి మాత్రమే ఉంటారు. కానీ ఐపీఎస్‌ అధికారులు జిల్లాకి ఒకరి కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీరు వివిధ హోదాలలో పనిచేస్తారు. అందుకే ఐఏఎస్‌ అధికారి కంటే ఐపీఎస్‌ అధికారి జీతం, స్థానం తక్కువగా ఉంటుంది.

శాంతిభద్రతలను నిర్వహించడం ఐపీఎస్‌ అధికారి బాధ్యత. అంతే కాకుండా నేరాన్ని విచారించే పని కూడా వీరి ద్వారానే జరుగుతుంది. ఐపీఎస్ అధికారులు డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫాం ధరిస్తారు. కానీ ఐఏఎస్ అధికారికి డ్రెస్ కోడ్ ఉండదు. ఐఏఎస్‌ అధికారులకు పోస్టు ఆధారంగా కారు, బంగ్లా, అంగరక్షకుడు వంటి సౌకర్యాలు కల్పిస్తారు. కానీ పోలీసు యంత్రాంగం మొత్తం ఐపీఎస్ అధికారి చేతుల్లో ఉంటుంది. ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి పని వేరుగా ఉన్నా.. ఇద్దరు అధికారుల శిక్షణ కొన్ని నెలలపాటు కలిసి సాగుతుంది. ఈ అధికారులకు 3 నెలల ఫౌండేషన్ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వేరుచేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories