Ten Thousand Note: రూ.10,000 నోటు చరిత్ర మీకు తెలుసా..! ఎప్పుడు ముద్రించారు..?

When was the Ten Thousand Note Printed What is its History
x

రూపాయలు పదివేల నోటు (ఫైల్ ఇమేజ్)

Highlights

Ten Thousand Note: అసలు పదివేల నోటుని ముద్రించారని మీకు తెలుసా..?

Ten Thousand Note: మీరు రూపాయి నోటు నుంచి మొదలుకొని రెండు వేల నోటు వరకు చూడవచ్చు. కానీ పదివేల రూపాయల నోటు ఎప్పుడైనా చూశారా..! అసలు పదివేల నోటుని ముద్రించారని మీకు తెలుసా..? అవును ఇది నిజం. అవును కొన్నేళ్ల క్రితం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా పదివేల నోటుని ముద్రించింది. కానీ మళ్లీ ఆపేసింది. దీనికి కారణాలేంటి.. అసలు పదివేల నోటు చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

సాధారణంగా కరెన్సీ నోట్లని ముద్రించే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కొన్ని షరతుల వల్ల అది పరిమితంగానే జరుగుతుంది. ఎక్కువగా కరెన్సీ ముద్రిస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీని కారణంగా కరెన్సీ విలువ పడిపోతుంది. ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరుగుతుంది. జీడీపీ, వృద్ధిరేటు, ఆర్థిక లోటు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం, ఆర్బీఐ ఎంత కరెన్సీ ముద్రించాలో నిర్ణయిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ 1956 నుంచి 'కనీస రిజర్వ్ సిస్టమ్' కింద కరెన్సీని ముద్రిస్తుంది.

1938 సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ₹ 10,000 నోటును ముద్రించింది. అయితే దీనిని జనవరి 1946లో డీమోనిటైజ్ చేశారు. తరువాత, ₹ 10, 000 నోట్లను 1954 సంవత్సరంలో మళ్లీ ముద్రించడం ప్రారంభించారు చివరగా ఈ నోట్లను 1978లో రద్దు చేశారు. పదివేల నోటు కొంతకాలం వరకే మార్కెట్లో చెలామణి అయింది. దీనివల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసి ప్రభుత్వం దీని ముద్రణను నిలిపివేసింది.

ఎన్ని రూపాయల వరకు నోట్లను ముద్రించవచ్చు?

రిజర్వ్ బ్యాంక్ ఆప్‌ ఇండియా రూ.2000 రూపాయల వరకు మాత్రమే నోట్లను ముద్రిస్తుందని అనుకుంటారు కానీ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎన్నివేల నోట్లనైనా ముద్రించవచ్చు. 1934లోని సెక్షన్ 24 ప్రకారం కేవలం రూ. 2,5,10,20,50,100,200,500,2000 నోట్లను మాత్రమే కాకుండా రూ.10,000 వరకు నోట్లను ముద్రించవచ్చు. అయితే దీనికి చాలా నిబంధనలు ఉన్నాయి. తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ముందుగా ఆర్‌బీఐ దేశ పరిస్థితులను అంచనా వేసి ఎన్ని నోట్లను ముద్రించాలో తెలుసుకుని ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటుంది. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చే ముందు ఒక్కసారి ఆర్‌బిఐతో చర్చిస్తుంది. దాని ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుంది. కానీ తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories