New Features in Whatsapp: వాట్సప్ లో రెండు కొత్త ఫ్యూచర్లు!

New Features in Whatsapp: వాట్సప్ లో రెండు కొత్త ఫ్యూచర్లు!
x
Whats App
Highlights

New Features in Whatsapp: ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫ్యూచర్లును ముందుకు తీసుకువస్తూ ఉంటుంది వాట్సప్..

New Features in Whatsapp: ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫ్యూచర్లును ముందుకు తీసుకువస్తూ ఉంటుంది వాట్సప్.. అందులో భాగంగానే మరో రెండో కొత్త ఫ్యూచర్లను ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సప్ బిజినెస్ ద్వారా వివిధ వ్యాపార సంస్థలు, షాపులు తమ కస్టమర్లతో సంప్రదింపులు జరపాలి అంటే వారి కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా సదరు సంస్థ QR కోడ్‌ ఉంటే సరిపోతుంది. దీని ద్వారా నేరుగా కస్టమర్లతో చాటింగ్ చేసే సదుపాయాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఒక్కసారి QR కోడ్‌ స్కాన్ చేస్తే స్క్రీన్ మీద వెంటనే కంటున్యూ అనే ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.

దీంతో పాటుగా మరో సదుపాయాన్ని కలిపించింది. వ్యాపార సంస్థలతో కస్టమర్లకి మరింత కమ్యూనికేషన్ ఉపయోగపడే విధంగా వివిధ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన కేటలాగ్‌లు, ఆయా ఉత్పత్తుల లిస్టింగ్ కు సంబంధించిన వెబ్ సైట్ లింకులు, వారి ఫేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వడానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ QR Code సదుపాయం ద్వారా వినియోగదారులకు అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 50 మిలియన్లకు పైగా వాట్సాప్ బిజినెస్ యాప్ యూజర్లు ఉన్నారని వాట్సాప్ వెల్లడించింది, వారిలో 15 మిలియన్లు భారతీయులే కావడం విశేషం..


Show Full Article
Print Article
Next Story
More Stories