Optical Illusion: మీరు ఎలాంటి వారో ఈ ఫొటో చెప్తుంది.. సరిగ్గా గమనించండి

Optical Illusion: మీరు ఎలాంటి వారో ఈ ఫొటో చెప్తుంది.. సరిగ్గా గమనించండి
x
Highlights

అయితే ఒకప్పుడు ఇలాంటి ఫొటోల గురించి పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి సామాన్యులకు సైతం వీటిపై ఓ అవగాహన వస్తోంది.

మన ఆలోచనలు, మన ఒక వస్తువును చూసే విషయమే మనం ఏంటో నిర్ణయిస్తుంది. మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. వ్యక్తి ఒక వస్తువును ఎలా చూస్తాడన్నదాని ఆధారంగా అతను వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు. ఇందులో భాగంగానే మానసిక నిపుణులు. కొన్ని ఫొటోల ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. దీనినే పర్సనాలిటీ టెస్ట్‌గా చెబుతుంటారు.

అయితే ఒకప్పుడు ఇలాంటి ఫొటోల గురించి పెద్దగా ఎవరికీ తెలిసేవి కావు. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో అప్పటి నుంచి సామాన్యులకు సైతం వీటిపై ఓ అవగాహన వస్తోంది. ఇందులో భాగంగానే పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఒక మనిషి తలలా అనిపిస్తోంది కదూ. అయితే జాగ్రత్తగా గమనిస్తే అందులో ఒక ఎలుకతో పాటు కొన్ని చిన్న పక్షులు ఉన్నాయి. అయితే ఈ ఫొటో చూసిన వెంటనే మీకు మొదట ఏం కనిపించిందో దాని బట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవేళ మీకు ఈ ఫొటో చూసిన వెంటనే ఎలుక కనిపిస్తే. మీరు బలహీనమైన మనస్తత్వం కలిగిన వారని అర్థం చేసుకోవాలి. మీ గురించి ఎవరేం అనుకుంటున్నారో అన్న ఆలోచనలో ఉంటారు. మిమ్మల్ని ఎవరో ఎగతాలి చేస్తున్నారని, మీపై జాలి చూపిస్తున్నారని భయపడుతుంటారు. అయితే మీ పనులను మీరే చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిదీ మీరే చేయాలని కోరుకుంటా. ఇతర వ్యక్తుల నుంచి సాయం పొందాలంటే భయపడుతుంటారు. స్వంతంగా సవాళ్లను ఎదుర్కోవటానికి ఇష్టపడతారు.

ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల ఎదురైన సమయంలో ఎవరి సహాయం తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించారు. మీ శక్తివంచన మేరకు మీ కష్టాన్ని మీరే సాల్వ్‌ చేసుకుంటారు. ఒకవేళ ఈ ఫొటో చూసిన వెంటనే మీకు మనిషి ముఖం కనిపిస్తే. మీరు ఒంటరితనంతో భపడుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ సన్నిహితులకు, మీ కుటుంబ సభ్యులకు విలువ ఇస్తారని అర్థం చేసుకోవాలి. పక్కవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఉంటారని అర్థం.

Show Full Article
Print Article
Next Story
More Stories