Real Eggs And Fake Eggs: నిజమైన గుడ్లకి నకిలీ గుడ్లకి తేడా ఏంటి.. ఇలా గుర్తించండి..!

What is the Difference Between Real Eggs and Fake Eggs
x

Real Eggs And Fake Eggs: నిజమైన గుడ్లకి నకిలీ గుడ్లకి తేడా ఏంటి.. ఇలా గుర్తించండి..!

Highlights

Real Eggs And Fake Eggs: నిజమైన గుడ్లకి నకిలీ గుడ్లకి తేడా ఏంటి.. ఇలా గుర్తించండి..!

Real Eggs And Fake Eggs: దేశంలో చలికాలం మొదలైంది. దీంతో గుడ్లకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే వీటిలో పెద్ద మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, ఒమేగా-3 ఉంటాయి. డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు నకిలీ గుడ్లని అమ్మి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. దీని వల్ల అనారోగ్యానికి గురికావల్సి ఉంటుంది. భారతదేశంలో గుడ్డు ఉత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులు అత్యధికంగా ఉండగా తెలంగాణ గుడ్ల వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌లోనే రోజుకు 75 లక్షల కోడిగుడ్ల డిమాండ్‌ ఉందని ఓ నివేదిక పేర్కొంది.

నకిలీ గుడ్ల వ్యాపారం

కోడిగుడ్లకు డిమాండ్ పెరగడంతో రోజురోజుకు నకిలీ కోడిగుడ్ల వ్యాపారం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు నకిలీ గుడ్లు తిని అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే వాటిని కొనుగోలు చేసే సమయంలో పరీక్షిస్తే అసలుదేదో,నకిలీదేదో తెలుస్తుంది. ఈసారి గుడ్లు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. గుడ్డు మెరుపు చూసి కొనవద్దు. జాగ్రత్తగా వ్యవహరించండి.

నిజమైన, నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలి?

నకిలీ గుడ్లను తయారు చేయడానికి దాని షెల్ మీద ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తారు. అందువల్ల మీరు వాటిని మంట సమీపాన ఉంచినట్లయితే గుడ్డు నుంచి కాలిన వాసన వస్తుంది. ఒక్కోసారి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గుడ్డు కొనేటప్పుడు దానిని చేతితో ఆడించండి. దాని నుంచి ఎటువంటి శబ్దం రాదు. నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కానీ నకిలీ గుడ్డును కదిలిస్తే దాని నుంచి కొంత శబ్దం వస్తుంది. అందుకే గుడ్డును కొనే ముందు ఇలా పరిశీలించండి. నకిలీ గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories