Challenging Vote: ఛాలెంజింగ్‌ ఓటు అంటే ఏమిటి.. ఈ ఓటును ఎవరు వేస్తారు..?

What is Challenging Vote and Know how to Challenge Vote
x

Challenging Vote: ఛాలెంజింగ్‌ ఓటు అంటే ఏమిటి.. ఈ ఓటును ఎవరు వేస్తారు..?

Highlights

Challenging Vote: ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఎనలేని ప్రాధాన్యముంది. ఓటే కాదా ఒక్కరు వేయకపోతే ఏమవుతుందన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు.

Challenging Vote: ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఎనలేని ప్రాధాన్యముంది. ఓటే కాదా ఒక్కరు వేయకపోతే ఏమవుతుందన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఒక్కోసారి అ ఒక్క ఓటే కీలకంగా మారుతుంది. ఎన్నికల సమయంలో సాధారణ ఓటు తోపాటు చాలెంజింగ్ ఓటు అన్న మరో పేరు కూడా వినబడుతుంది. అసలు ఈ చాలెంజింగ్ ఓటు అంటే ఏమిటి..? ఈ ఓటును ఎవరు వేస్తారు, ఏ సందర్భంలో వేస్తారు..?

ఓటు అనేది ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటింది. ఓటర్లు దీనిని ఎలా వాడుకుంటే అదే రిజల్ట్ వస్తుంది. ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకుంటే భవిష్యత్ బంగారుమయంగా ఉంటుంది. అలాకాకుండా ఓటును నోటుకో, మద్యానికో అమ్ముకుంటే కష్టాలుపడక తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడంతో శాసనసభ, పార్లమెంట్ ఉభయ సభల్లోకి క్రిమినల్ రికార్డులున్న వాళ్లే ఎక్కువగా అడుగు పెడుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి పెనుముప్పును తెచ్చే పెట్టే అవకాశం ఉంది.

ప్రస్తుతం నూటికి తొంభై శాతం మంది ఏదో ఒక ప్రయోజనం కోసం రాజకీయాల్లోకి కొనసాగుతున్నారు. కేవలం10శాతం మాత్రమే ప్రజాసేవ చేసేందుకు వస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఇప్పుడంతా ఓటుకు నోటు రాజకీయాలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో దొంగ ఓట్లు వేయడం కూడా కన్పిస్తూ ఉంటుంది. ఎవరైనా తమ ఓటును దొంగ ఓట్ల కారణంగా వినియోగించుకోనే అవకాశం కోల్పోతే ఈ పద్ధతి ద్వారా తిరిగి తమ ఓటు హక్కును పొందే అవకాశం లభించనుంది.

ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు పోలవడం ఎక్కడో ఒకచోట కామన్ అయిపోయింది. మన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ ముందుగానే మన ఓటును ఎవరో ఒకరువేసి వెళ్లడం కన్పిస్తుంది. దీంతో చేసేదేమీలేక ఓటర్లు వెనుతిరుగుతూ ఉంటారు. దీనికి చెక్ పెట్టేలా కండాక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని సెక్షన్ 49పీ ఓటుహక్కుకు రక్షణ కల్పిస్తోంది. ఈ సెక్షన్ ప్రకారంగా ఎవరైనా మన ఓటువేసి వెళ్లినప్పుడు ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులకు కోరే అవకాశం ఉంటుంది.

అనంతరం మనం ఛాలెంజ్ ఓటును నమోదు చేయాలని ప్రిసైడింగ్ అధికారిని కోరచ్చు. ఛాలెంజ్ ఓటు వేసిన ఫిర్యాదుదారుడి నుంచి సంబంధిత ఎన్నికల అధికారి 2 రుసుం తీసుకుని రసీదు ఇస్తారు. వచ్చిన ఓటరు అసలైన వ్యక్తా.. కాదా అని విచారిస్తారు. అసలైన ఓటరు అని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి 2 జప్తు చేస్తారు. నిజమైన ఓటరు కాని పక్షంలో ఓటరు నుంచి 2 తీసుకుని ఏజెంట్‌కు అందించి.. సదరు వ్యక్తిని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. ఇవే కాకుండా ఓటేసే వ్యక్తి వయసు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉందని అనుమానంగా ఉంటే ఆ వ్యక్తి ద్వారా రాతపూర్వక డిక్లరేషన్‌ తీసుకుని ఓటేసే అవకాశం కల్పిస్తారు. దీనిని ఫారం 16లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఓటేసిన తర్వాత వీవీప్యాట్‌ నుంచి వచ్చే స్లిప్‌లో.. మనం ఓటేసిన వ్యక్తికి కాకుండా వేరేది వస్తే.. రాతపూర్వకంగా అభ్యంతరం తెలపవచ్చు. దానిని సంబంధిత అధికారులు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనంతరం మరోసారి పరిశీలించి.. తగు విధంగా చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్‌ నుంచి వచ్చిన స్లిప్‌ సరిగానే ఉంటే ఆ పూర్తి వివరాల్ని 17సీ ఫారంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన ఓటు ఒక్కోసారి గెలుపొటములను డిసైడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.

భారత రాజ్యాంగం... 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికు ఇచ్చిన పాశుపతాస్త్రం ఓటుహక్కు. ఇలాంటి సందర్భాల్లో ఓటర్లు అవగాహనలేమితో కొన్నిసార్లు పొరపాటున తమ హక్కుకు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ఇలాంటి వెసులుబాట్లు కల్పించింది ఎన్నికల సంఘం. వీటిని ఉపయోగించుకుని నవసమాజ నిర్మాణంలో భాగస్వాములవడం ఓటరుగా మన బాధ్యత అనేది ప్రతీ ఓటరు గుర్తుంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories