Stop Drinking Alcohol: మద్యం తాగడం సడెన్‌గా మానేస్తే ఏం జరుగుతుంది..?

What are the consequences of suddenly stopping drinking alcohol know what the experts say
x

Stop Drinking Alcohol: మద్యం తాగడం సడెన్‌గా మానేస్తే ఏం జరుగుతుంది..?

Highlights

Stop Drinking Alcohol: నేటి కాలంలో ఏ చిన్న ఫంక్షన్‌ అయినా సరే మద్యం లేనిదే జరగడం లేదు. మనిషి పుట్టినా, చనిపోయినా, బర్త్‌డే, పెళ్లిళ్లు ఇలా జీవితంలో మంచి, చెడులు ఏదైనా సరే మద్యం లేనిదే జరగడం లేదు.

Stop Drinking Alcohol: నేటి కాలంలో ఏ చిన్న ఫంక్షన్‌ అయినా సరే మద్యం లేనిదే జరగడం లేదు. మనిషి పుట్టినా, చనిపోయినా, బర్త్‌డే, పెళ్లిళ్లు ఇలా జీవితంలో మంచి, చెడులు ఏదైనా సరే మద్యం లేనిదే జరగడం లేదు. ఇక యువత గురించి చెప్పనవసరం లేదు. మత్తులో మునిగి తేలుతున్నారు. నేటి సమాజంలో కొంతమంది ఆల్కహాల్ తాగడం ఒక స్టేటస్‌ సింబల్‌గా భావిస్తున్నారు.

మద్యం ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా తాగుతున్నారు. క్యాన్సర్‌ బారిన పడి చనిపోతున్నారు. అయితే కొంతమంది ఈ మత్తులో నుంచి బయటపడడానికి మద్యం మానేస్తున్నారు. కానీ సాధారణ మనిషిలా బతకలేకపోతున్నారు. మద్యం తాగడం సడెన్‌గా మానేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడూ తాగినా అది శరీరంలోని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మద్యం తాగిన తర్వాత అది పొట్టలోకి వెళ్లి మూత్రం ద్వారా శరీరాన్ని వదిలి వెళ్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది శరీరంలోకి వెళ్లిన తర్వాత అవయవాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాలా మందికి తెలియదు. మద్యం ఎంత తాగుతున్నారు.. ఎప్పుడు తాగుతున్నారు.. ఎంత కాలం నుంచి తాగుతున్నారు అనే విషయాలను పక్కన పెడితే ఆల్కహాల్ శరీరానికి ప్రమాదకరం. దీని వల్ల పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు.

మద్యం తాగడం మానేసిన వ్యక్తుల్లో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీన్ని విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మద్యం హఠాత్తుగా మానేసిన తర్వాత కొంతమందిలో టెన్షన్, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నేళ్ల నుంచి మద్యం తాగుతూ ఒక్కసారిగా మానేస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది మద్యం తాగడం మానేసిన తర్వాత చెవుల్లో పెద్ద పెద్ద శబ్ధాలు వినిపిస్తుంటాయి. ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. అయోమయం, కోపం, తమ ముందు ఏముందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories