కాదేదీ ఉచితానికి అనర్హం.. కిలో దోశ పిండికి బిందె నీరు ఫ్రీ అక్కడ!

కాదేదీ ఉచితానికి అనర్హం.. కిలో దోశ పిండికి బిందె నీరు ఫ్రీ అక్కడ!
x
Highlights

వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తేనే వ్యాపారం నడుస్తుంది. దానికోసం వినియోగదారుల బలహీనతల్నీ ఓడిసిపట్టుకోవాల్సి ఉంటుంది....

వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తేనే వ్యాపారం నడుస్తుంది. దానికోసం వినియోగదారుల బలహీనతల్నీ ఓడిసిపట్టుకోవాల్సి ఉంటుంది. ఊరికే ఎదో పథకం ప్రకటించేస్తే వ్యాపారాన్ని వినియోగదారుల దగ్గరకు చేర్చలేరు. కొత్తదనం ఉండాలి.. అది వినియోగదారుడి తాజా బలహీనత అయ్యుండాలి. ఇదంతా ఎందుకంటే,

చెన్నై లో నీటి ఎద్దడి దారుణంగా ఉంది. నీరు దొరకక సామాన్య ప్రజల అవస్థలు అన్నీ, ఇన్నీ కాదు. సామన్యులనే కాదు.. కంపెనీలు, సెలబ్రిటీలు కూడా నీటి కట కటకు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా స్నానానికి అరబకేట్ నీరు దొరక్క ఇబ్బంది పడ్డానని స్వయంగా చెప్పారు. అక్కడ ఇప్పుడు బిందె నీరు 5 రూపాయలు. ఇది ఇలా ఉంటే, ఈ నీటి ఎద్దడిని.. ప్రజలకున్న నీటి అవసరాన్ని తన వ్యాపారానికి ఉపయోగించుకున్తున్నాడో వ్యాపారి. తన వద్ద ఉన్న దోశ పిండి అమ్మకాలను పెంచుకునేందుకు, కిలో పిండి కొంటే, బిందె నీరు ఉచితమని ప్రకటించాడు. ఈ మేరకు అతని దుకాణం ముందు పెట్టిన ప్లెక్సీ అందరినీ ఆకర్షిస్తుండగా, నీళ్ల కోసం దోశ పిండి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం సాగుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories